Begin typing your search above and press return to search.

ఆ స్టార్ విష‌యంలో ప్రాజెక్ట్- కె నిర్మాత‌లు ఫిక్స్ అవ్వ‌లేదా?

ప్ర‌భాస్ క‌ల్కీ లో న‌టిస్తున్నారా? అని ప్ర‌శ్నించ‌గా ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. ' నేను సినిమాలో ఉన్నానో.. లేదో ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు చెప్పాలి.

By:  Tupaki Desk   |   21 Aug 2023 5:49 AM GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో 'ప్రాజెక్ట్ -కె' ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. అమితాబ‌చ్చ‌న్..క‌మ‌ల్ హాస‌న్ లాంటి లెజెండ్స్ సినిమాలో భాగ‌మ‌వ్వ‌డంతో సినిమాపై అంచ‌నాలు తారా స్థాయికి చేరాయి. విశ్వ‌న‌టుడు ఏకంగా విల‌న్ పాత్ర‌లోనే క‌నిపిస్తున్నారు? అన్న ప్ర‌చారం అంత‌కంత‌కు హైప్ తీసుకొస్తుంది. ఇంకా దీపికా ప‌దుకొణే..దిశా ప‌టానీ లాంటి బ్యూటీలు సినిమాలో భాగ‌మ‌వ్వ‌డంతో? అన్నీ ర‌కాల ఫీస్టులు త‌ధ్యమ‌నిపిస్తుంది.

ఈ నేప‌థ్యంలో మాలీవుడ్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా న‌టిస్తున్నాడ‌ని ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఎంట్రీ దాదాపు ఖాయ‌మైంది? అన్న‌ట్లు ఓ సంద‌ర్భంలో దుల్క‌ర్ కూడా రివీల్ చేసారు. అయితే తాజాగా మ‌రో ఇంట‌ర్వ్యూలో ఉన్నాడా? లేడా? అన్న డౌట్ రెయిజ్ అయ్యేలా స్పందించారు. ప్ర‌భాస్ క‌ల్కీ లో న‌టిస్తున్నారా? అని ప్ర‌శ్నించ‌గా ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. ' నేను సినిమాలో ఉన్నానో.. లేదో ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు చెప్పాలి.

కానీ ఇప్ప‌టివ‌ర‌కూ చాలా సినిమాల గురించి విన్నాను. చూసాను. కానీ అలాంటి సినిమా మాత్రం ఎవ‌రూ తీయ‌లేదు. క‌ల్కీ భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌నే మ‌లుపు తిప్పే సినిమా అవుతుంద‌ని' ధీమా వ్య‌క్తం చేసారు. దుల్క‌ర్ ఇచ్చిన స‌మాధానం అన్ క్లారిటీ గా ఉంది. ఎంపిక చేసార‌ని ఓసారి..ఆ విష‌యం చెప్పాల్సింది తాను కాదంటూ మ‌రోసారి చెప్ప‌డం క‌న్ ప్యూజన్ లోకి నెట్టిన‌ట్లు అవుతుంది.

ఈ నేప‌థ్యంలో న‌టిస్తున్నాడా? లేదా? అన్న‌ది ఆయ‌న‌కే క్లారిటీ లేన‌ట్లుగా ఉంద‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్లు షురూ అయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ విష‌యాన్ని ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు ఏ సంద‌ర్భంలోనూ రివీల్ చేయ‌లేదు. అధికారిక నిర్మాణ సంస్థ ద్వారా కూడా విష‌యాన్ని మీడియాకి లీక్ చేయ‌లేదు. విష‌యం రెండుసార్లు దుల్క‌ర్ ద్వారానే లీకైంది. మ‌రి సినిమాలో ఉన్నాడా? లేడా? అన్న‌ది నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇదే సంస్థ‌లో దుల్క‌ర్ 'సీతారామం' తెలుగు సినిమా చేసి భారీ విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందే.