యూత్ కి సినిమా ఎక్కితే వసూళ్లు ఇలా ఉంటాయ్..!
ఒక సినిమా సూపర్ హిట్ అవ్వడానికి అభిమానులు ఎంత కారణమో అదే సినిమా సక్సెస్ కి యూత్ ఆడియన్స్ ప్రభావం కూడా ఎక్కువే అని చెప్పొచ్చు
By: Tupaki Desk | 3 March 2025 10:02 AM ISTఒక సినిమా సూపర్ హిట్ అవ్వడానికి అభిమానులు ఎంత కారణమో అదే సినిమా సక్సెస్ కి యూత్ ఆడియన్స్ ప్రభావం కూడా ఎక్కువే అని చెప్పొచ్చు. ఒక సినిమా యూత్ ఆడియన్స్ ని మెప్పించింది అంటే అది సూపర్ హిట్ కొట్టినట్టే లెక్క. కాలేజ్ బంక్ కొట్టి మరీ సినిమా చూసేది వాళ్లే ఇనిమా కలెక్షన్స్ తో బాక్సాఫీస్ లెక్కలు మార్చేది కూడా వాళ్లే. అలా యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ గా వచ్చిన ప్రతి సినిమాను సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చేసేస్తున్నారు.

ఇలాంటి సూపర్ హిట్ సక్సెస్ నే అందుకుంది రీసెంట్ గా రిలీజైన సినిమా డ్రాగన్. అదే తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా వచ్చింది. ఈ సినిమాను అశ్వత్ మరిముత్తు డైరెక్ట్ చేయగా సినిమాలో ప్రదీప్ రంగనాథ్, అనుపమ పరమేశ్వరన్, కయదు లోహార్ ప్రధాన పాత్రలు చేశారు. యువత మెచ్చే అంశాలతో పాటు లైఫ్ ఫిలాసఫీని కూడా చెప్పే సినిమాగా డ్రాగన్ అదరగొట్టేసింది.
తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమాకు సూపర్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా డ్రాగన్ సినిమా సక్సెస్ ఫుల్ గా 100 కోట్ల క్లబ్ లో చేరింది. సినిమా సక్సెస్ అవ్వడమే కాదు వసూళ్ల పరంగా కూడా అదరగొట్టేసింది ఈ డ్రాగన్. సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసిన సందర్భంగా చిత్ర యూనిట్ అంతా కలిశారు. సినిమా సక్సెస్ అయినందుకు యూనిట్ అంతా కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు.
ఓ మై కడవులే సినిమాతో మెప్పించిన డైరెక్టర్ అశ్వత్ ఈసారి డ్రాగన్ తో మళ్లీ తన టాలెంట్ చూపించాడు. డ్రాగన్ సినిమాలో కథ కథనాలు అన్నీ కూడా యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా చేశాడు. అంతేకాదు ఎమోషన్ కూడా అదిరిపోయింది. అందుకే సినిమా అక్కడ ఇక్కడ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు కలెక్షన్స్ తో 100 కోట్లు కూడా కలెక్ట్ చేసి అదరహో అనిపించుకుంది.
డ్రాగన్ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసిన విషయాన్ని ఆ సినిమా హీరో ప్రదీప్ రంగనాథ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అంతకుముందు లవ్ టుడే సినిమాతో ఇదే రేంజ్ సక్సెస్ అందుకున్న ప్రదీప్ డ్రాగన్ తో కూడా సూపర్ హిట్ కొట్టాడు. ఈ హీరో నెక్స్ట్ విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో ఎల్.ఐ.కె సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.