పెళ్లైన తొమ్మిదేళ్లకు తల్లిగా!
ఈ ఏడాది అక్టోబర్ లోనే దామి బిడ్డకు స్వాగతం పలకబోతుంది.
By: Tupaki Desk | 16 Jun 2024 12:30 AM GMTహిందీ సీరియళ్లతో తెలుగు లోగిళ్లలో ఫేమస్ అయిన ద్రష్టి దామి గురించి పరిచయం అవసరం లేదు. బుల్లి తెర సీరియళ్లు చూసే వారందరికీ దామి బాగా సుపరిచితురాలు. తెలుగు ప్రేక్షకులు అమెని తమ ఇంట్లో ఆడబిడ్డలా ఆదరిస్తారు. తాజాగా ద్రష్టి దామి అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పేసింది. త్వరలో తాను తల్లికాబోతున్నట్లు తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ లోనే దామి బిడ్డకు స్వాగతం పలకబోతుంది.
అయితే మాతృమూర్తిగా మారడానికి ఆమెకి చాలా సమయం పట్టింది. పెళ్లైన తొమ్మిదేళ్లకు గానూ పిల్లలు కలగలేదు. పిల్లల కోసం ఆమె చేయని పూజలంటూ లేవని గతంలో చాలాసార్లు మీడియాలో కథనాలొ చ్చాయి. ఈ కథనాల పట్ల వ్యక్తిగతంగా ఆమె ఎంతో బాధపడుతున్నట్లు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వాపోయింది. ఇప్పుడు ఆమె కోరిక నెరవేరుతుంది. ప్రస్తుతం ద్రష్టి ఎంతో సంతోషంలో కనిపిస్తుంది. 2015 లో దామి నీరజ్ ఖేమ్కాని ప్రేమ వివాహం చేసుకుంది.
ఇక ద్రష్టి దామి కెరీర్ సంగతి చూస్తే డాన్స్ రియాల్టీ 'షో నాచ్ బలియే'లో పాల్గొంది. 2007 లో టీవీ సీరియల్ 'దిల్ మిల్ గయే' ద్వారా ఎంట్రీ ఇచ్చింది. 2010 లో గుర్మీత్ చౌదరి సరసన 'గీత్-హుయ్ సబ్సే పరాయి' సీరియల్ లో నటించింది. తెలుగులో మధుబాలగా ఓ సీరియల్ అనువాదమైంది. ఆ సీరియల్ ఇక్కడ ఎనలేని గుర్తింపును ,పేరును తీసుకొచ్చింది. ఆ సీరియల్ తో ఆమెకి ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు.
అందులో గొప్ప కోడలు ఎలా ఉండాలో? ఆమె పాత్రలో చూపించారు. అలాగే 'ఎక్ ఇష్క్ ఏక్ జూనూన' సీరియల్ తో నార్త్ లో ఇంకా ఫేమస్ అయింది. ఇందులో ఆమె వివియన్ దేవాకు జంటగా నటించింది. ఇటీవలే ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో 'ది ఎంఫైర్', 'దురంగ' అనే వెబ్ సిరీస్ లు చేసింది. ప్రస్తుతం కెరీర్ ని ఆదిశగానే ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతుంది.