Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్స్‌ ఫైట్‌... యాడ్‌ భలే వైరల్‌

డ్రీమ్‌ 11 వారు అమీర్‌ 11, రణబీర్‌ 11 పేర్లతో జట్లను ఎంపిక చేశారు. ఆ జట్లను ప్రమోట్‌ చేయడం కోసం ఈ యాడ్‌ను వదిలారు.

By:  Tupaki Desk   |   13 March 2025 12:15 PM IST
సూపర్ స్టార్స్‌ ఫైట్‌... యాడ్‌ భలే వైరల్‌
X

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్‌ 2025 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్‌ డ్రీమ్‌ 11 తన కొత్త ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త యాడ్‌లో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్స్‌ అమీర్ ఖాన్, రణబీర్‌ కపూర్‌, క్రికెట్‌ స్టార్స్ రోహిత్‌ శర్మ, బుమ్రా, రిషబ్ పంత్‌, హార్థిక్ పాండ్యా వంటి ప్రముఖ స్టార్స్‌ కనిపించారు. ఇప్పటి వరకు ఏ యాడ్‌లోనూ ఇంత భారీ స్టార్ కాస్ట్‌ లేదనే టాక్‌ వినిపిస్తుంది. 2 నిమిషాల 25 సెకన్ల పాటు ఉన్న ఈ యాడ్‌ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా అమీర్ ఖాన్‌, రణబీర్‌ కపూర్‌ మధ్య ఉన్న గొడవ యాడ్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది అనడంలో సందేహం లేదు.

డ్రీమ్‌ 11 వారు అమీర్‌ 11, రణబీర్‌ 11 పేర్లతో జట్లను ఎంపిక చేశారు. ఆ జట్లను ప్రమోట్‌ చేయడం కోసం ఈ యాడ్‌ను వదిలారు. యాడ్‌లో అమీర్ ఖాన్‌, రోహిత్‌ శర్మ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో పంత్‌ వెళ్లి అమీర్ భాయ్ ఒక ఫోటో తీసుకోవచ్చా అని అడుగుతాడు. అప్పుడు తప్పకుండా తీసుకుందాం అని అమీర్ ఖాన్ అనగానే మీతో కాదు రణబీర్‌తో అంటాడు. అప్పుడు నేను మాట్లాడి నీకు ఫోటో ఇప్పిస్తాను అంటూ అమీర్ తీసుకు వెళ్తాడు. అప్పుడు మాటల మధ్యలో రణబీర్‌ కపూర్‌ అని కాకుండా రణవీర్ సింగ్‌ అని అమీర్ ఖాన్‌ అంటాడు. దాంతో రణబీర్ కపూర్‌కి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్తాడు. అలా సరదాగా యాడ్‌ ను కొనసాగింది.

గజిని 2 సినిమా కోసం తాను రెడీ అవుతున్నాను అని, అందుకే మతి మరుపు అన్నట్లు అమీర్ ఖాన్‌ కవర్‌ చేసే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో తాను అమీర్‌ ఖాన్‌ అని కాకుండా షారుఖ్ ఖాన్‌ అని ఆయన్ను పిలిస్తే ఎలా అనిపిస్తుంది అంటాడు. యాడ్‌ మొత్తం చాలా సరదాగా సాగడంతో అందరిని నవ్వించింది. ఈ స్థాయిలో ఖర్చు చేసి యాడ్‌ను రూపొందించిన డ్రీమ్‌ 11 ను పలువురు అభినందిస్తూ ఉంటే, బాబోయ్‌ ఎంత లాభం వస్తే ఇంత మంది స్టార్స్‌తో యాడ్‌ చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఏది ఏమైనా ఇద్దరు స్టార్‌ హీరోలు అమీర్‌ ఖాన్, రణబీర్‌ కపూర్ వంటి స్టార్స్‌ను ఒకే స్క్రీన్‌పై చూడటం, అది కూడా ఫన్నీ వేలో వారిద్దరు మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అమీర్‌ ఖాన్‌ గత కొంత కాలంగా సక్సెస్‌ లేక సతమతం అవుతున్నాడు. మరో వైపు రణబీర్‌ కపూర్‌ యానిమల్‌ సినిమాతో వెయ్యి కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రామాయణం సినిమాతో పాటు బ్రహ్మాస్త్ర 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. యానిమల్‌ పార్క్‌ కూడా లైన్‌లో ఉందని సమాచారం. అమీర్‌ ఖాన్‌ కొత్త సినిమా త్వరలో ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.