Begin typing your search above and press return to search.

అందాల భామ‌ల్ని రౌండ‌ప్ చేసిన డ్రీమ్ వారియ‌ర్!

డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో అదొక‌టి.

By:  Tupaki Desk   |   17 July 2023 7:09 AM GMT
అందాల భామ‌ల్ని రౌండ‌ప్ చేసిన డ్రీమ్ వారియ‌ర్!
X

డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో అదొక‌టి. రెండు ద‌శాబ్ధాల ప్రయాణం లో ఎన్నో స‌క్సెస్ ఫుల్ చిత్రాలు అందించింది. కోలీవుడ్ తో పాటు...టాలీవుడ్ ..బాలీవుడ్ లోనూ ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది. 'కాష్మోరా'..'ఖైదీ'..'సుల్తాన్'..'ఖాకీ' లాంటి సినిమా ల‌తో సంస్థ మ‌రింత ఫేమ‌స్ అయింది. డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోనూ స‌ద‌రు బ్యాన‌ర్ స‌క్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.

ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ల్ని స‌ద‌రు బ్యాన‌ర్ ఎప్పుడూ ప్రోత్స‌హిస్తుంది. ఎంతో మంది యువ ప్ర‌తిభావం తులు ఈ బ్యాన‌ర్ ద్వారా ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌య‌మ‌య్యారు. తాజాగా ఈ బ్యాన‌ర్ వ‌రుస‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు జోరు గా నిర్మిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం నేష‌న‌ల్ క్ర‌ష్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న తో 'రెయిన్ బో' అనే సినిమా ని నిర్మిస్తుంది. ర‌ష్మిక కెరీర్ లో తొలి ఉమెన్ సెంట్రిక్ చిత్ర‌మిది. పాన్ ఇండియా వైడ్ అమ్మ‌డి క్రేజ్ చూసి స‌ద‌రు బ్యాన‌ర్ ర‌ష్మిక‌ తో ఈ ప్ర‌యత్నం చేస్తోంది.

ఇదొక భిన్న‌మైన రొమాంటిక్ ఫాంట‌సీ ఎంట‌ర్ టైన‌ర్. శాంత‌రూబ‌న్ తెర‌కెక్కిస్తోన్న సినిమా ప్ర‌స్తుతం సెట్స్ లో ఉంది. తెలుగు..త‌మిళ్ ఏక కాలం లో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మిగ‌తా భాష‌ల్లో అనువాద రూంప‌ లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఇక మ‌రో బ్యూటీ కీర్తి సురేష్ తో క‌న్నేవేది అనే మ‌రో లేడీ ఓరియేంటెడ్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు..త‌మిళ్ లోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇదొక డిఫ‌రెంట్ స్టోరీ. గ‌ణేష్ రాజ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ర‌ష్మిక సినిమా సెట్స్ లో ఉంగానే కీర్త సురేష్ తో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయ‌డం విశేషం. దీన్ని బ‌ట్టి డ్రీమ్ వారియ‌ర్ క్రేజీ భామ‌ల‌ తో ఉమెన్ సెంట్రిక్ చిత్రాల‌ తోనూ త‌మ బ్యాన‌ర్ ఖ్యాతిని వ్యాప్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఓ వైపు స్టార్ హీరోల‌ తో క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేస్తూనే ట్యాలెంటెడ్ బ్యూటీ ల‌తో ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు షురూ చేసారు.