'డ్రింకర్ సాయి' ఫస్ట్ సాంగ్.. యూత్ ను ఆకట్టుకునేలా..
అయితే ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. భాగీ భాగీ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.
By: Tupaki Desk | 29 Nov 2024 12:46 PM GMTధర్మ, ఐశ్వర్య శర్మ హీరోహీరోయిన్లుగా డ్రింకర్ సాయి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఆ మూవీకి డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, లహరిధర్ నిర్మిస్తున్నారు.
వాస్తవిక ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న డ్రింకర్ సాయి మూవీ నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ను డైరెక్టర్ మారుతి రిలీజ్ చేయగా.. మంచి స్పందన అందుకున్నాయి. ఆ తర్వాత మేకర్స్ రిలీజ్ టీజర్.. సినిమాపై క్రేజీ బజ్ క్రియేట్ చేసిందని చెప్పాలి.
యూత్ ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ డ్రింకర్ సాయి చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. లవ్ స్టోరీ హైలెట్ చేసిన టీజర్.. అందరినీ ఆకట్టుకుంది. రొమాంటిక్ సీన్స్ మెప్పించాయి. హీరోయిన్ డైలాగ్స్ చాలా బాగున్నాయని అనేక మంది నెటిజన్లు రివ్యూ ఇచ్చారు. ఆ డైలాగ్స్ ను సోషల్ మీడియాలో తెగ షేర్ చేశారు.
అయితే ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. భాగీ భాగీ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. సర్రంటూ కర్రెంటూ షాక్ కొట్టినట్టు అంటూ సాగుతున్న పాటను ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ రాశారు. శ్రీవసంత్ సంగీతం అందించగా.. జావేద్ అలీ తన గాత్రంతో సందడి చేశారు.
ప్రస్తుతం డ్రింకర్ సాయి ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంగ్ క్రేజీగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హీరో ధర్మ లుక్స్ బాగున్నాయని చెబుతున్నారు. హీరోయిన్ ఐశ్వర్య శర్మ క్యూట్ గా ఉన్నారని అంటున్నారు. లిరిక్స్ అండ్ మ్యూజిక్ యూత్ ను ఆకట్టుకునేలా ఉన్నాయని రివ్యూ ఇస్తున్నారు.
సాంగ్ లోని విజువల్స్ నేచురల్ గా ఉన్నాయని చెబుతున్నారు నెటిజన్లు. అయితే మూవీలో ధర్మ, ఐశ్వర్యతో పాటు పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి డ్రింకర్ సాయి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.