Begin typing your search above and press return to search.

ట్రైలర్: పిచ్చి ప్రేమలో డ్రింకర్ సాయి

ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటించిన "డ్రింకర్ సాయి" సినిమా విడుదలకు ముందు వరుస అప్డేట్స్ తో సౌండ్ గట్టిగానే చేస్తోంది.

By:  Tupaki Desk   |   9 Dec 2024 12:08 PM GMT
ట్రైలర్: పిచ్చి ప్రేమలో డ్రింకర్ సాయి
X

ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటించిన "డ్రింకర్ సాయి" సినిమా విడుదలకు ముందు వరుస అప్డేట్స్ తో సౌండ్ గట్టిగానే చేస్తోంది. సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ పొందాయి. తాజాగా, సినిమా డిసెంబర్ 27న థియేటర్లలో విడుదల కానుండగా, మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ మరింత అంచనాలను పెంచింది.

ధర్మ, భగి మధ్య ప్రేమకథతో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్, రొమాన్స్, ఎమోషన్స్, కామెడీ అంశాలతో నిండుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ ప్రారంభంలో ధర్మ ప్రేమను వ్యక్తం చేసే తీరు దాడిలా ఉంటే, ఆ తర్వాత ప్రేమలో పెరిగే మధుర క్షణాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ధర్మ తన ప్రేమను భాగికి అర్థం చేయించడానికి చేసిన ప్రయత్నాలు, ఆమెని గెలుచుకోవడంలో ఎదురైన సవాళ్లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అనిపిస్తుంది.

ధర్మ, ఐశ్వర్య మధ్య కెమిస్ట్రీ ట్రైలర్ లో డిఫరెంట్ గా ఉంది. రితు చౌదరి సపోర్టింగ్ క్యారెక్టర్ల మధ్య నడిచే ఫన్నీ ఎపిసోడ్స్ ప్రేక్షకులను నవ్వించేలా ఉన్నాయి. ఆ తర్వాత కథ ఎమోషనల్ మలుపు తీసుకుని, ప్రేమలో పడిన వారిని ఎదుర్కోవాల్సిన బాధను హృదయాన్ని తాకే విధంగా చూపించారు. ప్రేమ, ఫన్, బాధ ఇలా అన్ని అంశాలను పర్ఫెక్ట్ చూపించడంతో సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని ట్రైలర్ ద్వారా ఒక క్లారిటీ ఇచ్చేశారు

"డ్రింకర్ సాయి" చిత్రాన్ని బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ కలిసి ప్రొడ్యూస్ చేయగా, ఎవరెస్ట్ సినిమాసా మరియు స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందించారు. కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిజజీవిత సంఘటనలపై ఆధారపడి రూపొందిందని మేకర్స్ తెలిపారు. ట్రైలర్ తో సినిమాలో ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్లు, వినోదం, ఎమోషన్ అన్నీ ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించేలా ఉన్నాయి.

శ్రీ వసంత్ అందించిన సంగీతం, ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ విభాగాన్ని మెరుగు పరచడంతో, సినిమా హై క్వాలిటీ విజువల్స్ తో ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించనుందని అనిపిస్తోంది. ఇక డిసెంబర్ 27న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్న "డ్రింకర్ సాయి" ఓ డిఫరెంట్ ప్రేమకథగా నిలుస్తుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో క్లిక్కవుతుందో చూడాలి.