Begin typing your search above and press return to search.

అన్ స్టాపబుల్ షోలో రియల్ హీరో..!

బాలయ్య ఎనర్జిటిక్ హోస్టింగ్ టాలెంట్ ఇంకా సెలబ్రిటీల హంగామా షోకి మంచి వ్యూ కౌంట్ తెచ్చి పెడుతుంది.

By:  Tupaki Desk   |   3 Dec 2024 11:26 AM GMT
అన్ స్టాపబుల్ షోలో రియల్ హీరో..!
X

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 4 ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. బాలయ్య ఎనర్జిటిక్ హోస్టింగ్ టాలెంట్ ఇంకా సెలబ్రిటీల హంగామా షోకి మంచి వ్యూ కౌంట్ తెచ్చి పెడుతుంది. లేటెస్ట్ గా ఈ షోకి యువ హీరో నవీన్ పొలిశెట్టి హీరోయిన్ శ్రీలీల వచ్చారు. ఈ ఇద్దరితో కలిసి బాలకృష్ణ చేసిన హంగామా అదిరిపోనుంది. ప్రోమోతోనే ఈ ఎపిసోడ్ పై సూపర్ బజ్ తీసుకొచ్చారు. ఐతే ఈ షోలో కేవలం నవీన్ పొలిశేట్టి, శ్రీలీలతో పాటు మరో రియల్ హీరో గురించి ప్రస్తావించారు అతనే డాక్టర్ నరేంద్ర.

ఎవరైనా వైద్యం తెలిసిన వారు ఎలా రోగుల నుంచి డబ్బులు రాబట్టాలా అని ఆలోచిస్తారు. అంతేకాదు వేలు, లక్షలు అంటూ డిమాండ్ చేస్తారు కానీ అలా కాకుండా సమాజ సేవ కోసం తన వైద్య వృత్తి ఉపయోగపడేలా చేస్తున్నాడు డాక్టర్ నరేంద్ర. పెద్ద హాస్పిటల్ లో ఐదారు అంకెల జీతం తీసుకునే కెపాసిటీ ఉన్న ఆయన నిరుపేదలు వైద్యం అందని వారి కోసం అండగా నిలబడ్డాడు.

డాక్టర్ నరేంద్ర లైఫ్ జర్నీ ఎంతోమందికి స్పూర్తిని ఇస్తుంది. డాక్టర్ గా చేస్తున్న ఆయన వైద్యో నారాయణ హరి అనే మంత్రంగా తనకు వచ్చిన వైద్యాన్ని అమ్ముకోవడం కాదు సేవగా చేయాలని భావించాడు. అందుకే అతను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రైబల్ ఏరియాలో పేదవారికి ఉచితంగా వైద్య సదుపాయాలు అందిస్తున్నాడు. అంతేకాదు వైద్యానికి కావాల్సిన అన్నిటినీ ఉచితంగా అందిస్తున్నాడు.

సిటీ డాక్టర్ నుంచి ట్రైబల్ లైఫ్ సేవర్ గా డాక్టర్ నరేంద్ర జర్నీ ఎంతోమందికి స్పూర్తిదాయకమని చెప్పొచ్చు. నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ ద్వారా ఆయన చేస్తున్న ఈ సేవని ప్రపంచానికి తెలియచేస్తున్నారు. అసలు డాక్టర్ నరేంద్ర ఈ నిర్ణయానికి గల కారణాలు ఏంటి.. ఆయన్ను స్ప్రుషించిన అంశాలు ఏంటి..? ఆయన ఈ సేవలను ఎలా చేస్తున్నారు లాంటి విషయాలను ఎపిసోడ్ లో చూపించారు. ట్రైబల్ ఏరియాలో కావాల్సిన బేసిక్ నీడ్స్ వాటర్, ఎలెక్ట్రిసిటీ, హెల్త్ కేర్ ఇలా ఆయన అందిస్తున్నారు. అంతేకాదు విలేజ్ లో పిల్లలు చదువుకునేలా ఆయన చూస్తున్నారు. డాక్టర్ నరేంద్ర గురించి మరెన్నో విషయాలు ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 4 ఎపిసోడ్ 6 చూసి తెలుసుకోండి.