లైవ్ షోస్ తో డీఎస్పీలో వెయ్యి ఏనుగుల బలం!
దీంతో దేవి శ్రీప్రసాద్ కొత్తగా మ్యూజిక్ లైష్ షోస్ కూడా నిర్వహించడం మొదలు పెట్టారు.
By: Tupaki Desk | 5 Feb 2025 12:30 PM GMTథమన్ రేసులోకి రావడంతో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పై ఎఫెక్ట్ పడిన సంగతి తెలిసిందే. అలాగని పూర్తిగా అవకాశాలకు దూరంగా లేడు. కాకపోతే మునుపటి అంత బిజీగా కనిపించలేదు. థమన్ తో పాటు దేవి శ్రీ కూడా అవకాశాలు షేర్ చేసుకోవాల్సి వస్తోంది. అలా ఇద్దరు కలిసి మెలిసి పనిచేస్తున్నారు. దీంతో దేవి శ్రీప్రసాద్ కొత్తగా మ్యూజిక్ లైష్ షోస్ కూడా నిర్వహించడం మొదలు పెట్టారు. తొలి కన్సర్ట్ ఆ మధ్య హైదరాబాద లో ప్రారంభమైంది.
అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో లైవ్ కన్సర్టులు నిర్వహిస్తున్నారు. త్వరలో విశాఖపట్టణంలో కూడా భారీ ఈవెంట్ ఒకటి జరుగుతుంది. అయితే ఒక్కసారిగా దేవి ఇలా లైవ్ షోలు మొదలు పెట్టడంతో ఎన్నో రకాల సందేహాలు మొదలయ్యాయి. సినిమా అవకాశాలు తగ్గాయని...అతడి బ్రాండ్ మునుపటిలా పనిచేయలేదని అందుకే ఛాన్సులు రావడం లేదన్న వార్తలు తెరపైకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో లైవ్ కన్సర్టల గురించి మాట్లాడి తానెంత బలవంతుడన్నది చెప్పకనే చెప్పారు. లైవ్ షోలు చేయడం అన్నది తన కెరీర్ కి ప్లస్ గా అభివర్ణించారు. `అలా షోలు చేయడం మొదలైన తర్వాత నాకు వెయ్యి ఏనుగుల బలం తోడైనట్లు అయింది. ప్రేక్షకుల ఆదరణ అన్నది గొప్ప శక్తిని అందిస్తుంది. అది మనకు తెలియకుండానో ఒక్కోసారి జరిగిపోతుంది. వేలాది మంది మధ్య షోలు చేయడం..వాళ్లు ఆనందించడం గొప్ప అనుభూతిని ఇస్తుంది.
ఇంకా అద్భుతమైన మ్యూజిక్ చేయాలనే స్పూర్తి కలుగుతుంది. ఇండస్ట్రీలో ప్రతీ చిత్రాన్ని నా తొలి చిత్రంగానే భావిస్తాను. ఆ ప్రెష్ నెస్ ఫీలింగ్ నన్నెప్పుడు ముందుకు నడిపిస్తుంది. యుక్త వయసులోనే పరిశ్రమకు రావడం వల్ల ఇంత సుదీర్ఘ ప్రయాణాన్ని చూసే అవకాశం దక్కింది. నేను కూడా నా మ్యూజిక్ వింటూనే పెరిగాను` అన్నారు.