జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు దేవీశ్రీ రాకింగ్
ఆయన మాట్లాడుతూ..''నా దర్శకుడు సుకుమార్ సర్, నిర్మాత, నా స్నేహితుడు, సోదరుడు అల్లు అర్జున్, మా ఇతర టీమ్‌కి కృతజ్ఞతలు. అవార్డు పొందడం ఒక గొప్ప అనుభూతి.
By: Tupaki Desk | 24 Aug 2023 6:43 PM GMT'పుష్ప' చిత్రంలో నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఇదే పుష్ప చిత్రానికి సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్ సైతం ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డ్ అందుకోవడం విశేషం. నిజానికి పుష్ప చిత్రానికి దేవీశ్రీ సంగీతం, రీరికార్డింగ్ ప్రధాన బలాలుగా నిలిచాయి. సినిమా ఘనవిజయం సాధించడంలో అతడి సంగీతానికి మెజారిటీ మార్కులే వేయాలి.
పుష్ప సంగీతానికి గాను జాతీయ అవార్డ్ అందుకున్నందున దేవీశ్రీ ఈ విజయాన్ని మాటల్లో వర్ణించలేనని ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ..''నా దర్శకుడు సుకుమార్ సర్, నిర్మాత, నా స్నేహితుడు, సోదరుడు అల్లు అర్జున్, మా ఇతర టీమ్‌కి కృతజ్ఞతలు. అవార్డు పొందడం ఒక గొప్ప అనుభూతి. పుష్ప సంగీతాన్ని ఆదరించి ప్రేమిస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు. కొన్నిసార్లు వాణిజ్యపరంగా విజయాన్ని అందుకుంటాం.. కానీ అవార్డు రాకపోవచ్చు.
కానీ పుష్ప కోసం రెండింటినీ పొందడం గొప్ప బహుమతి. నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు పొందిన ఉప్పెన చిత్రానికి కూడా నేనే సంగీతం అందించాను'' అని కూడా దేవీశ్రీ తెలిపారు.
RRR కి ఉత్తమ సంగీత దర్శకుడిగా (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) పురస్కారం అందుకున్న ఆస్కార్ విజేత MM కీరవాణికి జాతీయ అవార్డు రావడంపై DSP వ్యాఖ్యానించారు. మొదట ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ కూడా గెలుచుకున్నందున మేము అవార్డును ఆశించలేదు. అయినప్పటికీ సంగీత విభాగంలో పుష్ప -RRR అవార్డులను గెలిచాయి. ఇది ఒక పెద్ద గౌరవం. కీరవాణి సర్‌కి బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరర్‌గా అవార్డు వచ్చింది. రాజమౌళి సర్ సహా మొత్తం RRR టీమ్, ఎన్టీఆర్, చరణ్‌కి పెద్ద అభినందనలు. పుష్ప లోని పాటకు అవార్డ్ గెలుపొందినందుకు నేను చాలా కృతజ్ఞుడను. ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నందుకు ఇప్పుడు నేను మరింత సంతోషంగా ఉన్నానని బన్ని తెలిపారు.
పుష్ప: ది రైజ్ సౌండ్‌ట్రాక్‌లో దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన '' దాక్కో దాక్కో మేక-శ్రీవల్లి-ఊ అంటావా ఊ ఊ అంటవా-సామి సామి... 'ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా' అనే ఐదు పాటలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రతిపాటా దేనికదే ప్రత్యేకం. దేవీశ్రీ ఎంతో మనసు పెట్టి పని చేసారు. అందుకే ఇప్పుడు ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది.