దేవి రెమ్యునరేషన్.. గట్టిగానే..
పాన్ ఇండియా బ్రాండ్ ఉండటంతో దేవిశ్రీ ప్రసాద్ రెమ్యునరేషన్ పెంచేసినట్లు టాక్. వచ్చే ఏడాది నాగ చైతన్య, ధనుష్ సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి.
By: Tupaki Desk | 7 Nov 2023 4:51 AM GMTసౌత్ ఇండియాలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని దేవిశ్రీ ప్రసాద్ క్రియేట్ చేసుకున్నారు. పుష్ప సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. పుష్పతో అతని సాంగ్స్ కి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇప్పటికి నార్త్ ఇండియాలో ఊ అంటావా సాంగ్స్ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది.
కరెక్ట్ గా దృష్టి పెడితే బాలీవుడ్ నుంచి కూడా దేవికి అవకాశాలు రావడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. అయితే చేతిలో పెద్ద ప్రాజెక్ట్స్ ఉండటంతో ఉన్నపళంగా ఎక్కువ సినిమాలు ఒప్పుసుకోవాలని దేవిశ్రీ ప్రసాద్ అనుకోవడం లేదు. కాని చాలా మంది దర్శకుడు ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ తో మ్యూజిక్ చేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పుష్ప2కి ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్పకి మించి ఈ చిత్రంలో సాంగ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ కంగువకి దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నారు. శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబోలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీకి దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంట. అలాగే నాగచైతన్య, చందూ మొండేటి సినిమాకి కూడా దేవిశ్రీ ప్రసాద్ ని ఫిక్స్ చేశారంట. ఇక రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకున్తున్నట్లు తెలుస్తోంది.
పుష్ప 2 కోసం దేవిశ్రీ ప్రసాద్ 5 కోట్ల వరకు తీసుకుంటున్నారు. అలాగే కంగువ మూవీకి అదే రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నారు. నాగచైతన్య, ధనుష్ చిత్రాలకి కూడా అదే రేంజ్ లో డిమాండ్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. పాన్ ఇండియా బ్రాండ్ ఉండటంతో దేవిశ్రీ ప్రసాద్ రెమ్యునరేషన్ పెంచేసినట్లు టాక్. వచ్చే ఏడాది నాగ చైతన్య, ధనుష్ సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి.
ఈ లోపు పుష్ప2, కంగువ సినిమాల సాంగ్స్ పూర్తయిపోతాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కి కూడా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. త్వరలో NC 23, శేఖర్ కమ్ముల, ధనుష్ సినిమా నిర్మాతల నుంచి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.