వీడియో: ప్రేయసి కోసం డబ్బు కట్టల్ని ఏం చేశాడో!
ఈ సంపన్నులు తమ సంపదను చూపించుకోవడానికి చేసే హాస్యాస్పదమైన పనులను చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.
By: Tupaki Desk | 29 Jun 2024 4:35 AM GMTప్రియురాలిపై ప్రేమ ఎక్కువైపోతే అవ్వొచ్చు..! కానీ ఇదేం వేషం? ఆమె నడిచి రావడానికి లేదా హెలీకాఫ్టర్ దిగేందుకు ఇలా డబ్బు కట్టల్ని మెట్లుగా పేర్చాలా? అతగాడి ధన బల ప్రదర్శనకు ఇదేనా సరైన మార్గం? .. ఇదిగో ఇక్కడి ఈ దృశ్యం చూశాక ప్రజలంతా అతగాడిని ఇలానే ప్రశ్నిస్తున్నారు. అతడి ధన మదాంధకారాన్ని ప్రశ్నిస్తోంది సభ్య సమాజం.
నిజానికి కొందరు వ్యక్తులు ప్రతి పైసాను జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. కొందరు పూట పూటకి తిండి కోసం లాటరీ కొట్టాల్సిన పరిస్థితి. మరికొందరు చిందులు వేయగలిగేంత సంపన్నులు ఉన్నారు. చాలా అరుదుగా కొందరు సంపన్నులు తమ డబ్బును నిర్లక్ష్యంగా వృధా చేస్తారు. ఈ సంపన్నులు తమ సంపదను చూపించుకోవడానికి చేసే హాస్యాస్పదమైన పనులను చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.
ఇంతకీ అతడు ఎవరు? డబ్బు కట్టలు అంత ఇదిగో పోగై ఉన్నాయి? అంటే.. అతడు ప్రముఖ దుబాయ్ వ్యాపారవేత్త... తన ప్రియురాలు నడవడానికి ఇలా డబ్బును పేర్చాడు. హెలీకాఫ్టర్ నుంచి దిగుతుంటే తన చేతిని పట్టుకుని నడిపిస్తున్నాడు. ఇప్పడు ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. డబ్బు కట్టలు పేర్చడమే కాకుండా తనను వాటిపై నడిపించేందుకు రెడ్ కార్పెట్ కాకుండా నేలపై నోట్ల కట్టలను ఉంచడం చూస్తేనే జనం అవాక్కవుతున్నారు. అయితే ఈ అందమైన అమ్మాయి రాణిలా విహరిస్తూ అబ్బురపరుస్తోంది.
మిస్టర్ థ్యాంక్యూ పేరుతో ఉన్న ఇన్‌స్టాలో తన జీవితాన్ని షేర్ చేసిన అతడి పేరు సెర్గీ కొసెంకో. ఇంతకుముందే తాను తన స్నేహితురాలు కలిసి ఉన్న వీడియోను పోస్ట్ చేశాడు. సెర్గీ ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. నేను ఎందుకు సరదాగా ఉన్నానో తెలుసా? నేను నిన్ను డబ్బు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను.. అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఈ వీడియోను 49 లక్షల మందికి పైగా వీక్షించారు. ఒక లక్షా పదిహేను వేల మందికి పైగా దీన్ని ఇష్టపడ్డారు. ఇది విస్తృతంగా షేర్ అయింది. వీడియోపై 3,200 కంటే ఎక్కువ వ్యాఖ్యలు వచ్చాయి. సెర్గీ అంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు? అతను ఏం చేస్తుంటాడు? అంటూ జనం ఆరాలు తీస్తున్నారు. ఒక ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. అతను దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ కంపెనీ నడిపిస్తున్నాడు. అతడి నికర ఆస్తుల విలువ 500 మిలియన్ డాలర్లు. రియల్ ఎస్టేట్ తో పాటు వేరేపు వ్యాపారాలు ఉన్నాయి. అతడు సోషల్ మీడియా ద్వారా కూడా మంచి జీవితాన్ని గడుపుతున్నాడు. సెర్గీకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ బాలుడితో అతడు తరచుగా ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నాడు.