Begin typing your search above and press return to search.

ఫస్ట్ డే హైయెస్ట్ షేర్ అందుకున్న డబ్బింగ్ సినిమాలు

తెలుగులో డబ్బింగ్ సినిమాలకి కూడా ప్రేక్షకులు పెద్దపీట వేస్తూ ఉంటారు. కంటెంట్ బాగుంటే బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి

By:  Tupaki Desk   |   13 July 2024 12:47 PM GMT
ఫస్ట్ డే హైయెస్ట్ షేర్ అందుకున్న డబ్బింగ్ సినిమాలు
X

తెలుగులో డబ్బింగ్ సినిమాలకి కూడా ప్రేక్షకులు పెద్దపీట వేస్తూ ఉంటారు. కంటెంట్ బాగుంటే బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి. ఈ డబ్బింగ్ సినిమాల ద్వారా తమిళ్ స్టార్ హీరోలు టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కి తెలుగులో హైయెస్ట్ మార్కెట్ ఉంది. అలాగే కమల్ హాసన్, సూర్య, విజయ్, కార్తీ, అజిత్, విశాల్, విక్రమ్ లాంటి స్టార్స్ సినిమాలకి తెలుగులో మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది.

కేజీఎఫ్ సిరీస్ తో యష్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. అలాగే కాంతారాతో రిషబ్ శెట్టి కూడా తెలుగు ప్రేక్షకులకి చేరువ అయ్యాడు. ఇదిలా ఉంటే డబ్బింగ్ సినిమాగా తెలుగులో రిలీజ్ అయ్యి మొదటి రోజు హైయెస్ట్ షేర్స్ అందుకున్న చిత్రాల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ ఉంది. ఈ సినిమా మొదటి రోజు 19.09 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

రెండో స్థానంలో సూపర్ స్టార్ రజినీకాంత్ 2.ఓ మూవీ నిలిచింది. ఈ సినిమా మొదటి రోజు 12.45 కోట్ల షేర్ ని అందుకుంది. మూడో స్థానంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి సినిమా ఉంది. ఈ సినిమా మొదటి రోజు 9.31 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగింది. దళపతి విజయ్ లియో మూవీ 8.31కోట్ల షేర్ తో నాలుగో స్థానం సంపాదించింది. తరువాత చియాన్ విక్రమ్ మనోహరుడు మూవీ మొదటి రోజు 7.56 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి టాప్ 5 స్థానంలోకి వచ్చింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీ మొదటి రోజు 7.01 కోట్ల షేర్ అందుకుంది. అలాగే ఫస్ట్ డే షేర్ కలెక్షన్ వైజ్ గా టాప్ 6లో నిలిచింది. దీని తర్వాత టాప్ 7లో తాజాగా రిలీజ్ అయిన భారతీయుడు 2 మూవీ నిలవడం విశేషం. ఈ సినిమా 6.75 కోట్ల షేర్ ని తెలుగులో వసూళ్లు చేసింది. కమల్ హాసన్ కెరియర్ లోనే హైయెస్ట్ షేర్ తెలుగులో ఈ సినిమాకి రావడం విశేషం.

దీని తర్వాత విజయ్ మాస్టర్ మూవీ 6.01 కోట్లతో టాప్ 8లో ఉంది. అలాగే బీస్ట్ మూవీ 4.81 కోట్ల షేర్ తో తొమ్మిదో స్థానంలో ఉంది. టాప్ 10లో రజినీకాంత్ దర్బార్ మూవీ ఉండటం విశేషం. ఈ సినిమా మొదటి రోజు 4.5 కోట్ల షేర్ ని మొదటి రోజు కలెక్ట్ చేసింది.

కేజీఎఫ్ చాప్టర్ 2 - 19.09CR

2.ఓ - 12.45Cr

కబాలి - 9.31Cr

లియో - 8.31CR

మనోహరుడు - 7.56Cr

జైలర్ - 7.01Cr

భారతీయుడు 2 - 6.75CR******

మాస్టర్ - 6.01Cr

బీస్ట్ - 4.81CR

దర్బార్ - 4.5Cr