Begin typing your search above and press return to search.

తెలుగులో హయ్యెస్ట్ ప్రాఫిట్ తెచ్చిన డబ్బింగ్ సినిమాలివే..

ఈ మధ్యకాలంలో ఇతర భాష చిత్రాలు తెలుగులో రిలీజ్ అయ్యి సాలిడ్ సక్సెస్ అందుకుంటున్నాయి

By:  Tupaki Desk   |   30 May 2024 4:51 AM GMT
తెలుగులో హయ్యెస్ట్ ప్రాఫిట్ తెచ్చిన డబ్బింగ్ సినిమాలివే..
X

ఈ మధ్యకాలంలో ఇతర భాష చిత్రాలు తెలుగులో రిలీజ్ అయ్యి సాలిడ్ సక్సెస్ అందుకుంటున్నాయి. మంచి కథ, కథనాలు ఉన్న మూవీస్ కి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే క్యాస్టింగ్ ఎవరైనా మూవీస్ ని సూపర్ హిట్ చేస్తున్నారు. ఆలా ఇప్పటి వరకు తెలుగులో ఇతర భాషల నుంచి డబ్బింగ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీస్ చాలా ఉన్నాయి.

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అలాగే కమల్ హాసన్, సూర్య, విక్రమ్, కార్తీ లాంటి స్టార్స్ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. మలయాళం నుంచి మోహన్ లాల్ కూడా టాలీవుడ్ లో మన్యం పులి సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయిన తెలుగు డబ్బింగ్ సినిమాలలో అత్యధిక ప్రాఫిట్ అందుకున్న మూవీస్ మాత్రం తక్కువగానే ఉన్నాయి.

వాటిలో మొదటి స్థానంలో ఉండేది విజయ్ ఆంటోనీ బిచ్చగాడు మూవీ. ఈ సినిమా కేవలం 50 లక్షల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి ఏకంగా 16.80 కోట్ల షేర్ అందుకుంది. అంటే ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాతకి 16.20 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన డబ్బింగ్ సినిమాలలో ఇదే హైయెస్ట్ షేర్ పర్సెంటేజ్ అని చెప్పాలి.

దీని తర్వాత కన్నడంలో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా మూవీ తెలుగులో 2 కోట్ల బిజినెస్ వేల్యూతో రిలీజ్ అయ్యింది. మూవీ ఏకంగా 29.65 కోట్ల షేర్ ని లాంగ్ రన్ లో కలెక్ట్ చేసింది. ఈ మూవీ కలెక్షన్స్ ద్వారా తెలుగులో రిలీజ్ చేసిన గీతా ఆర్ట్స్ కి 27.65 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. కన్నడ సినిమాకి ఈ స్థాయిలో రావడం టాలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ టైం అని చెప్పాలి.

నెక్స్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ చిత్రం అత్యంత ప్రాఫిటబుల్ మూవీగా తెలుగులో నిలిచింది. 12 కోట్ల బిజినెస్ తో తెలుగులో రిలీజ్ అయిన జైలర్ మూవీ ఏకంగా 47.90 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. ఓవరాల్ గా 35.90 కోట్ల ప్రాఫిట్ ఈ సినిమా ద్వారా వచ్చింది. రజినీకాంత్ కెరియర్ లోనే తెలుగులో హైయెస్ట్ ప్రాఫిట్ అందుకున్న మూవీగా జైలర్ నిలిచింది.