Begin typing your search above and press return to search.

దసరాకి డబ్బింగ్ సినిమాలేనా..?

ఈ దసరా సీజన్ కేవలం డబ్బింగ్ సినిమాలకే పరిమితమయ్యేలా ఉంది. ఇప్పటికే అక్టోబర్ 10న సూర్య కంగువ రిలీజ్ అనౌన్స్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ వేటయ్యన్ కూడా అదే రోజు వచ్చేలా ఉంది.

By:  Tupaki Desk   |   24 July 2024 3:48 AM GMT
దసరాకి డబ్బింగ్ సినిమాలేనా..?
X

స్టార్ సినిమా పండగకి వస్తే ఫెస్టివల్ వైబ్ ని అభిమాన హీరో సినిమా చూసి మరింత జోష్ తెచ్చుకోవాని సినీ ప్రియులు అనుకుంటారు. అందుకే మన దగ్గర పండగ వచ్చింది అంటే పెద్ద సినిమాల జాతర మొదలవుతుంది. ఈ క్రమంలో ఏడాదిలో మొదలయ్యే సంక్రాంతికి స్టార్ సినిమాలన్నీ రేసులో దిగుతాయి. సంక్రాంతికి పై చేయి సాధించాలనే కసితో అందరు స్టార్స్ వస్తారు. ఐతే ఆ ఫెస్టివల్ సీజన్ లో ఫ్యామిలీ సినిమాలు, యాక్షన్ సినిమాలు ఇలా అన్నిటినీ ఆదరిస్తారు ఆడియన్స్. సంక్రాంతి మిస్ అయ్యింది అంటే స్టార్ సినిమాలన్నీ మాక్సిమం సమ్మర్ లోనే దించుతారు.

జూన్, జూలై లో కేవలం తప్పదు అనుకుంటేనే రిలీజ్ చేస్తారు. ఇక ఆగష్టు 15 కూడా స్టార్స్ కి ఒక మంచి రిలీజ్ డేట్ అని చెప్పొచ్చు. అది మిస్సైతే మళ్లీ దసరాకి టార్గెట్ చేస్తారు. దసరా వస్తుంది అంటే ముందే తమ సినిమాల రిలీజ్ లను అనౌన్స్ చేస్తారు. అయితే ప్రతి ఏడాది దసరాకి తెలుగులో రెండు మూడు సినిమాలు పోటీ పడుతుంటాయి కానీ ఈసారి మాత్రం కేవలం డబ్బింగ్ సినిమాలే వచ్చేలా ఉన్నాయి.

అగష్టు 15న తెలుగులో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆగష్టు 29న నాని సరిపోదా శనివారం వస్తుంది. సెప్టెంబర్ లో కూడా కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ లు ఉన్నాయి. సెప్టెంబర్ 27న ఎన్.టి.ఆర్ దేవర వస్తున్నాడు. ఐతే అక్టోబర్ 10 దసరా టైం లో మాత్రం ఇప్పటివరకు అయితే ఏ తెలుగు సినిమా ఎనౌన్స్ ప్రకటించలేదు. అసలైతే ఎన్.టి.ఆర్ దేవర సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో మళ్లీ డేట్ ముందుకు వేశారు. సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ లాక్ చేశారు.

ఈ దసరా సీజన్ కేవలం డబ్బింగ్ సినిమాలకే పరిమితమయ్యేలా ఉంది. ఇప్పటికే అక్టోబర్ 10న సూర్య కంగువ రిలీజ్ అనౌన్స్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ వేటయ్యన్ కూడా అదే రోజు వచ్చేలా ఉంది. సూర్య కంగువ పాన్ ఇండియా లెవెల్ లో భారీ హైప్ తో వస్తుంది. శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై తెలుగులో కూడా మంచి మార్కెట్ జరుగుతుంది. రజిని వేటయ్యన్ సినిమాను జై భీమ్ TN జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఆ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే ఈ రెండు తమిళ డబ్బింగ్ సినిమాలతోనే ఈ దసరా ముగిసేలా ఉంది. మాములుగా అయితే పండగ సీజన్ ని మన వాళ్లు అంత ఈజీగా వదలరు. మరి ఎందుకు ఈ దసరాకి అలా చేస్తున్నారన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకైతే ఏ సినిమా రిలీజ్ ప్రకటించలేదు ఒకవేళ ఆ టైం కు ఏదైనా సినిమా ముందుకు తెస్తారేమో చూడాలి.