జీవితంలో స్పీడ్ బ్రేకర్లు గుంతల పై స్టార్ హీరో
జీవితాన్ని తాను డ్రైవింగ్ చేయడానికి ఇష్టపడే రోడ్లతో, మలుపులు ఎత్తుపల్లాలతో పోల్చాడు దుల్కార్ సల్మాన్. తన భార్య అమల్ సూఫియాతో 13ఏళ్ల ప్రయాణాన్ని అతడు విశ్లేషిస్తూ ఒక సుదీర్ఘ నోట్ రాసాడు.
By: Tupaki Desk | 22 Dec 2024 11:02 AM GMTజీవితాన్ని తాను డ్రైవింగ్ చేయడానికి ఇష్టపడే రోడ్లతో, మలుపులు ఎత్తుపల్లాలతో పోల్చాడు దుల్కార్ సల్మాన్. తన భార్య అమల్ సూఫియాతో 13ఏళ్ల ప్రయాణాన్ని అతడు విశ్లేషిస్తూ ఒక సుదీర్ఘ నోట్ రాసాడు. నేడు 13వ పెళ్లి రోజు సందర్భంగా దుల్కార్ రాసిన నోట్ చాలా అంతర్గత విషయాలను నర్మగర్భంగా వెల్లడించింది.
ప్రేమ ఇప్పటికీ ఉందని చెప్పడానికి నిదర్శనం నా భార్య.. నేను ఉన్నంత వరకు ఆమెతోనే ప్రయాణం అంటూ ఎమోషనల్ నోట్ రాసాడు. వైఫ్ అమల్‌తో రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసిన దుల్కర్ క్యాప్షన్ తమ అందమైన జీవిత ప్రయాణం గురించి చెబుతూ... ఒకరినొకరు భార్యాభర్తలు అని పిలుచుకోవడం నుండి .. తల్లిదండ్రులుగా పిలుపు అందుకునే స్థాయికి వారు ఎలా ఎదిగారో తెలిపాడు.
జీవితం నేను డ్రైవ్ చేయడానికి ఇష్టపడే రోడ్లతో సమానం. ఎన్నో మలుపులు.. హెచ్చు తగ్గులు ఎదురయ్యాయని అతడు నోట్‌లో రాసాడు. జీవితంలో కొన్నిసార్లు స్పీడ్ బ్రేకర్లు గుంతలు ఉంటాయని, అయితే అందమైన బాటలో అద్భుతమైన వ్యూతో మృధువైన రోడ్లను కూడా జీవితం అందిస్తుందని దుల్కర్ పేర్కొన్నారు. సుఫియా తన పక్కన ఉంటే ఎలాంటి సవాల్‌ని అయినా అధిగమించగలనని .. లక్ష్యాలను చేరుకోగలనని దుల్కర్ నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
దుల్కర్-అమల్ జంటకు సినీపరిశ్రమ స్నేహితులు, బంధువుల నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టోవినో థామస్ దంపతులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. అదితి రావ్ హైదరీ కూడా కొన్ని రెడ్ హార్ట్ ఎమోజీలను షేర్ చేసి ప్రేమ జంటను ఆకాశానికెత్తేసింది. దుల్కర్ సల్మాన్ 22 డిసెంబర్ 2011న అమల్ సూఫియాను పెళ్లి చేసుకున్నారు. 2017లో వారు తమ మొదటి బిడ్డ మరియం అమీరా సల్మాన్ కు స్వాగతం పలికారు. దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అతడి నటనకు ప్రశంసలు కురిసాయి. తెలుగులో ఓకే బంగారం, సీతారామం, మహానటి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన దుల్కర్ సల్మాన్ కి నిత్యామీనన్ తో ఎఫైర్ ఉందన్న ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత అవన్నీ రూమర్లు అని అభిమానులకు స్పష్ఠత వచ్చింది. దుల్కర్ - నిత్యా మీనన్ కలిసి ఐదు చిత్రాల్లో జంటగా నటించారు.