Begin typing your search above and press return to search.

దుల్కర్ చెప్పాడంటే చేస్తాడంతే..!

ప్రస్తుతం దుల్కర్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో లక్కీ భాస్కర్ సినిమా వస్తుంది. దీపావళి కానుకగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది ఈ సినిమా.

By:  Tupaki Desk   |   27 Oct 2024 6:08 AM GMT
దుల్కర్ చెప్పాడంటే చేస్తాడంతే..!
X

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సొంత భాషలో సినిమాలు చేస్తూనే మరోపక్క తెలుగు, తమిళ భాషల్లో తనకు తగిన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అదేంటో దుల్కర్ మలయాళ సినిమాల కన్నా తెలుగు సినిమాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదిస్తున్నాడు అనిపిస్తుంది. మహానటి, సీతారామం రెండు సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో దుల్కర్ సల్మాన్ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం దుల్కర్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో లక్కీ భాస్కర్ సినిమా వస్తుంది. దీపావళి కానుకగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది ఈ సినిమా.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. లక్కీ భాస్కర్ ట్రైలర్ చూసిన ఆడియన్స్ సినిమాపై ఆసక్తి పెంచుకున్నారు. తప్పకుండా ప్రేక్షకులను నచ్చే సినిమాగా ఇది రాబోతుంది. ఐతే ఈ సినిమా విషయంలో దుల్కర్ సల్మాన్ తను ఇదివరకు ఇచ్చిన ఒక ప్రామిస్ ని నిలబెట్టుకున్నాడు.

దుల్కర్ చేస్తున్న సినిమాలు తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈక్వల్ గా రిలీజ్ అవుతున్నాయి. ఐతే అంతకుముందు దుల్కర్ తమిళ్ డబ్బింగ్ మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు తమిళ ఆడియన్స్. ఐతే దీన్ని సీరియస్ గా తీసుకున్న దుల్కర్ నెక్స్ట్ టైం కచ్చితంగా సొంత డబ్బింగ్ తో వస్తానని చెప్పాడు. ఐతే దుల్కర్ చెప్పాడంటే చేస్తాడన్నట్టే అన్నట్టుగా లేటెస్ట్ గా లక్కీ భాస్కర్ తమిళ వర్షన్ కు తానే సొంత డబ్బింగ్ చెప్పాడు దుల్కర్ సల్మాన్.

సినిమా పట్ల తనకున్న అంకితభావంతో భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ని ఏర్పరచుకుంటున్నాడు దుల్కర్ సల్మాన్. అందుకే అతను ఎలాంటి సినిమాతో వచ్చినా సరే ప్రేక్షకులు ప్రేమతో ఆదరిస్తున్నారు. ఇక లక్కీ భాస్కర్ సినిమా విషయానికి వస్తే మధ్యతరగతి బ్యాంక్ ఎంప్లాయ్ నేపథ్యంతో అద్భుతమైన కథ కథనంతో ఈ సినిమా వస్తుంది. సినిమా తప్పకుండా ఆడియన్స్ ని అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు చిత్ర యూనిట్.

స్ట్రైట్ తెలుగు హీరోకి ఈక్వల్ రేంజ్ మార్కెట్ ని సంపాదించాడు దుల్కర్ సల్మాన్. ధనుష్ తో సార్ సినిమా తీసి సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరి ఈసారి దుల్కర్ తో లక్కీ భాస్కర్ అంటూ వస్తున్నాడు. సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు అన్ని సినిమాపై మంచి బజ్ ఏర్పరచగా దీపావళికి వస్తున్న సినిమాల మధ్య లక్కీ భాస్కర్ లక్ ఎలా ఉంటుందో చూడాలి.