Begin typing your search above and press return to search.

క్రేజీ హీరో ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా..!

సినిమా ఇండస్ట్రీలో హీరోల పారితోషికాలకు రెక్కలు వచ్చాయి. ఒకప్పుడు ఉన్న పారితోషికంతో పోల్చితే ఇప్పుడు వందల రెట్లు పెరిగాయి.

By:  Tupaki Desk   |   24 Oct 2024 4:29 AM GMT
క్రేజీ హీరో ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా..!
X

సినిమా ఇండస్ట్రీలో హీరోల పారితోషికాలకు రెక్కలు వచ్చాయి. ఒకప్పుడు ఉన్న పారితోషికంతో పోల్చితే ఇప్పుడు వందల రెట్లు పెరిగాయి. సినిమా మార్కెట్‌, బడ్జెట్‌లను దృష్టిలో పెట్టుకోకుండా హీరోలకు వందల కోట్ల పారితోషికాలు ఇస్తున్న నిర్మాతలు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం పదుల కోట్లు, వందల కోట్ల పారితోషికం అందుకుంటున్న హీరోలు సైతం కెరీర్‌ ఆరంభంలో వందల్లో, వేలల్లో పారితోషికం తీసుకున్న సందర్భాలు ఉండి ఉంటాయి. ప్రస్తుతం స్టార్స్‌గా, సూపర్ స్టార్స్‌గా వరుస సినిమాలు చేస్తున్న హీరోలు కొన్ని సార్లు వారి మొదటి పారితోషికం గురించి మాట్లాడినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత తక్కువకు నటించారా అనే అనుమానం సైతం వస్తూ ఉంటుంది.

తాజాగా దుల్కర్‌ సల్మాన్‌ తన మొదటి పారితోషికంను గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. లక్కీ భాస్కర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దుల్కర్‌ సల్మాన్‌ ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన మొదటి పారితోషికం గురించి స్పందించారు. ఒక టీవీ యాడ్‌ లో నటించినందుకు గాను రూ.2000 లను పారితోషికంగా పొందాను. తన పదేళ్ల వయసులో ఆ పారితోషికం అందుకున్నాను. అందులో ఎక్కువ భాగం నా తాతలతో షేర్‌ చేసుకున్నాను. ఆ సమయంలో అంత డబ్బుతో ఏం చేయాలో కూడా అర్థం అయ్యేది కాదని దుల్కర్‌ సల్మాన్‌ తన మొదటి పారితోషికం వివరాలను వెళ్లడించి అభిమానులతో పాటు నెటిజన్స్‌ ను సర్‌ప్రైజ్‌ చేశారు.

తెలుగు లో ఇప్పటికే మహానటి, సీతారామం సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్‌ బిగ్‌ సక్సెస్‌ లను దక్కించుకున్న దుల్కర్‌ సల్మాన్‌ 'లక్కీ భాస్కర్‌' సినిమాతో అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమా భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అవుతోంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ డబ్‌ చేసి విడుదల చేయబోతున్నారు. విభిన్నమైన, వినోదభరిత కథాంశంతో రూపొందిన ఈ పీరియాడిక్‌ డ్రామాలో దుల్కర్‌ సల్మాన్‌ పాత్రకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతారు అంటూ మేకర్స్‌ తో పాటు ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

దుల్కర్‌ సల్మాన్‌ కు జోడీగా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. డబ్బు చుట్టూ తిరిగే ఈ కథను దర్శకుడు వెంకీ అట్లూరి చాలా చక్కగా ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ఈ సినిమాతో దుల్కర్‌ సల్మాన్ టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ కొట్టబోతున్నాడని, ఆయనకు ఈ సినిమాతో మరింత మంది అభిమానులుగా మారుతారనే నమ్మకం వ్యక్తం అవుతోంది. లేడీ ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉండే దుల్కర్‌ సల్మాన్‌ మరోసారి తన ఫాలోయింగ్‌ పెంచుకునే విధంగా లక్కీ భాస్కర్‌లో కనిపించబోతున్నాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఆయన సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకుని పాన్ ఇండియా హిట్‌ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.