Begin typing your search above and press return to search.

లక్కీ భాస్కర్.. మరో బిగ్గెస్ట్ ప్లాన్

దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ మూవీ అక్టోబర్ 31న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

By:  Tupaki Desk   |   27 Oct 2024 4:35 AM GMT
లక్కీ భాస్కర్.. మరో బిగ్గెస్ట్ ప్లాన్
X

దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ మూవీ అక్టోబర్ 31న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు. మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మూవీ కూడా సూపర్ హిట్ కావడం గ్యారెంటీ అని మేకర్స్ భావిస్తున్నారు.

ముఖ్యంగా నిర్మాత నాగవంశీ అయితే ‘లక్కీ భాస్కర్’ పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ లో సినిమాపై తన ఒపీనియన్ చెప్పారు. మూవీలో ఒక్క మైనస్ కూడా ఎవరికి కనిపించదని చెప్పాడు. ఎవరైనా ఈ చిత్రంలో తప్పులు ఎత్తిచూపిస్తే వారికి పార్టీ ఇస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఈ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ప్రీమియర్ షోల ప్రదర్శనలో కూడా నాగవంశీ చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 100 ప్రీమియర్ షోలు లక్కీ భాస్కర్ సినిమాకి వేయబోతున్నారంట.

స్టార్ క్యాస్టింగ్ లేని సినిమాకి 100 ప్రీమియర్ షోలు అంటే కచ్చితంగా నిర్మాత ధైర్యాన్ని మెచ్చుకోవాలని సినీ విశ్లేషకులు అంటున్నారు. మూవీ అవుట్ ఫుట్ మీద ఉన్న నమ్మకంతోనే ఇంత భారీ ఎత్తున ప్రీమియర్ షోలు వేయడానికి నిర్మాత నాగవంశీ సిద్ధమయ్యారనే మాట వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘సార్’ మూవీకి ప్రీమియర్స్ వేసి సక్సెస్ అయ్యారు.

అలాగే ‘దేవర’ సినిమాని సితార వారు ఏపీలో డిస్టిబ్యూట్ చేశారు. దీనికి భారీగా ప్రీమియర్ షోలు వేసి మంచి కలెక్షన్స్ ని నిర్మాత నాగవంశీ అందుకున్నారు. ఈ నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్’ మూవీకి కూడా ప్రీమియర్ షోలు ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. సినిమా మీద నమ్మకంతోనే అతను ధైర్యంగా ప్రీమియర్ షోలని అక్టోబర్ 30 రాత్రికి వేస్తున్నారు. ఈ షోల ద్వారా పబ్లిక్ లోకి వెళ్లే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ మూవీకి అడ్వాంటేజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

‘సీతారామం’ లాంటి క్లాసిక్ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్ నుంచి ఈ మూవీ వస్తోంది. ‘లక్కీ భాస్కర్’ లో కూడా దుల్కర్ తనదైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించినట్లు అర్ధమవుతోంది. ఈ మూవీతో దుల్కర్ హిట్ కొడితే తెలుగులో అతనికి హ్యాట్రిక్ సక్సెస్ లు లభించినట్లు అవుతుంది.