ఇది నా కెరీర్ బిగ్గెస్ట్ మూవీ : దుల్కర్ సల్మాన్
కింగ్ ఆఫ్ కోత మా అందరి డ్రీం ప్రాజెక్ట్ గత ఏడాది అంతా కూడా ఈ సినిమాపైన వర్క్ చేశాం.. నా కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ ఇదని అన్నారు దుల్కర్ సల్మాన్.
By: Tupaki Desk | 14 Aug 2023 4:52 AM GMTనూతన దర్శకుడు అభిలాష్ జోషి దర్శకత్వంలో కింగ్ ఆఫ్ కోత అనే గ్యాంగ్ స్టర్ మూవీతో వస్తున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయగా ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా రానా, నానిలు అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్ తెలుగులో మాట్లాడి ఆడియన్స్ ని మెప్పించారు.
ఇంతకీ దుల్కర్ సల్మాన్ ఏం మాట్లాడారు అంటే.. అందరికీ నమస్కారం అని మొదలు పెట్టిన దుల్కర్ ఇండస్ట్రీలో అందరూ నాపై ఎంతో ప్రేమ చూపించారు.. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కింగ్ ఆఫ్ కోత మా అందరి డ్రీం ప్రాజెక్ట్ గత ఏడాది అంతా కూడా ఈ సినిమాపైన వర్క్ చేశాం.. నా కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ ఇదని అన్నారు దుల్కర్ సల్మాన్. కింగ్ ఆఫ్ కోత నేను బలంగా నమ్మి చేసిన గ్యాంగ్ స్టర్ మూవీ.. మీరు అంతా ఈ సినిమాను చూసి పెద్ద హిట్ కాదు బ్లాక్ బస్టర్ చేస్తారని ఆశిస్తున్నా అన్నారు. నేను ఇష్టపడే నాని గారికి చాలా థాంక్స్. నాని హాయ్ నాన్న కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు దుల్కర్.
నా ఫ్రెండ్ రానాని నేను చీఫ్ అని పిలుస్తాను. మీ అందరి ప్రేమకి నా కృతజ్ఞతలు. భాషలకు అతీతంగా సినిమాలను ఆదరిస్తున్నారు. కింగ్ ఆఫ్ కోత తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని అన్నారు దుల్కర్ సల్మాన్. సినిమాలో నటించిన ఐశ్వర్య, అనికా, సినిమాలో భాగమైన అందరికీ థాంక్స్ అని అన్నారు. అభిలాష్ జోషి ఫస్ట్ సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కించారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అద్భుతంగా అందించారు. ఈ సినిమా కోసం నాలుగు భాషల్లో నేను డబ్బింగ్ చెప్పాను. తెలుగులో కూడా నా వాయిస్ ఉంటుందని అన్నారు దుల్కర్. ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా కింగ్ ఆఫ్ కోత సినిమా వస్తుంది. ఇది నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ ఈ సినిమాలో డ్యాన్స్, యాక్షన్, సాంగ్స్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయని అన్నారు దుల్కర్.
దుల్కర్ సల్మాన్ తెలుగులో మహానటి సినిమాలో స్ట్రైట్ మూవీ చేశారు. అంతకుముందు మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించారు. మహానటి లో ఆ పాత్రకు తను మాత్రమే పర్ఫెక్ట్ అనేలా చేశారు దుల్కర్. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన సీతారాం సినిమా దుల్కర్ ఇమేజ్ ని స్ట్రాంగ్ చేసింది. ఇప్పటివరకు సాఫ్ట్ కథలతో వచ్చిన దుల్కర్ ఫస్ట్ టైం కింగ్ ఆఫ్ కోత సినిమాతో మాస్ మూవీతో వస్తున్నారు. మరి ఈ సినిమా దుల్కర్ మునుపటి సినిమాల్లానే తెలుగు ఆడియన్స్ ని అలరిస్తుందా లేదా అన్నది చూడాలి.