Begin typing your search above and press return to search.

'లక్కీ భాస్కర్' గేమ్ మొదలైంది.. గెట్ రెడీ

తాజాగా సినిమా ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చారు. లక్కీ భాస్కర్‌' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రేపు సాయంత్రం 4 గంట‌ల 41 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మూవీ టీం ప్ర‌క‌టించింది.

By:  Tupaki Desk   |   2 Feb 2024 2:33 PM
లక్కీ భాస్కర్ గేమ్ మొదలైంది.. గెట్ రెడీ
X

'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యాడు మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్. అంతకంటే ముందు 'మహానటి' సినిమాలో ప్రధాన పాత్ర పోషించి తన నటనతో అదరగొట్టాడు. సీతారామం సక్సెస్ తో తెలుగులోనూ ఈ హీరోకి మంచి క్రేజ్ దక్కింది. భాషతో సంబంధం లేకుండా కథ నచ్చితే చాలు సినిమాలు చేసే హీరోల్లో దుల్కర్ కూడా ఒకరు. ఇక తెలుగులో సీతారామం తర్వాత 'లక్కీ భాస్కర్' అనే మరో స్ట్రైట్ మూవీ చేస్తున్నాడు.


గత ఏడాది ధనుష్ తో 'సార్' సినిమా తెరకెక్కించి భారీ సక్సెస్ అందుకున్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 'లక్కీ భాస్కర్' అనే డిఫరెంట్ టైటిల్ పెట్టి సినిమాపై అంచనాలను పెంచిన మేకర్స్ తాజాగా సినిమా ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చారు. లక్కీ భాస్కర్‌' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రేపు సాయంత్రం 4 గంట‌ల 41 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మూవీ టీం ప్ర‌క‌టించింది.

ఇక ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్ బ్యాంకు ఉద్యోగిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. డబ్బు చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా ఉండబోతోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో హీరో దుల్కర్ సల్మాన్ 'మగధ' అనే బ్యాంకులో ఎంప్లాయ్ గా పనిచేస్తున్నట్లు చూపించారు. సీతారామం తర్వాత దుల్కర్ సల్మాన్ చేస్తున్న రెండవ స్ట్రైట్ తెలుగు ఫిలిం ఇది. దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కోలీవుడ్ మ్యూజీక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్‌ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

వెంకీ అట్లూరి గత సినిమా 'సార్' కి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించాడు జీవి ప్రకాష్. ఇప్పుడు మరోసారి 'లక్కీ భాస్కర్' కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల 'కింగ్ ఆఫ్ కోత' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ సల్మాన్ కి ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందించలేకపోయింది. అందుకే ఈసారి 'లక్కీ భాస్కర్' తో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.