Begin typing your search above and press return to search.

ఉల‌వ‌చారు బిర్యానీ అంటే జుర్రేస్తాడుట‌!

హైద‌రాబాద్ బిర్యానీ ఇష్ట‌ప‌డ‌ని వారు ఎవ‌రుంటారు. హైద‌రాబాద్కి ఎవ‌రొచ్చినా ఇక్క‌డ బిర్యానీ రుచి చూడాల్సిందే

By:  Tupaki Desk   |   9 Feb 2024 11:30 PM GMT
ఉల‌వ‌చారు బిర్యానీ అంటే జుర్రేస్తాడుట‌!
X

హైద‌రాబాద్ బిర్యానీ ఇష్ట‌ప‌డ‌ని వారు ఎవ‌రుంటారు. హైద‌రాబాద్కి ఎవ‌రొచ్చినా ఇక్క‌డ బిర్యానీ రుచి చూడాల్సిందే. బిర్యానీ కోస‌మే ప్ర‌త్యేకంగా హైద‌రాబాద్ కి వ‌చ్చేవారు ఎంతో మంది. అలాంటి వారిలో ఇప్పుడు న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా చేరిపోయిన‌ట్లే క‌నిపిస్తుంది. దుల్క‌ర్ కి హైద‌రాబాద్ బిర్యానీ అంటే అత్యంత ఇష్ట‌మ‌ట‌. అందులోనూ ఉల‌వ‌చారు బిర్యానీ అంటే జుర్రేస్తా అంటున్నాడు. తొలిసారి హైద‌రాబాద్ కి వ‌చ్చిన‌ప్పుడు బిర్యానీలో ఒక‌ర‌క‌మే టేస్ట్ చేసాడుట‌.

ఆ రుచి న‌చ్చ‌డంతో ఎప్పుడు హైద‌రాబాద్ కి వ‌చ్చినా అన్ని ర‌కాల బిర్యానీలు రుచి చూడ‌టం మొద‌లు పెట్టాడుట‌. వాటిలో బాగా న‌చ్చిన బిర్యానీ ఏది? అంటే ఉల‌వ‌చారు బిర్యానీ అంటున్నాడు. ఎప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చిన ఉల‌వ‌చారు బిర్యానీ తిన‌కుండా తిరుగు ప్ర‌యాణంలో ప్లైట్ ఎక్క‌డుట‌. బేసిక్ గానే దుల్క‌ర్ కి ముక్క‌లేనిదే ముద్ద దిగ‌దుట‌. ఎప్పుడైనా వెజ్ తింటే స్నేహితులు నువ్వు ఇలాంటి కూడా తింటావా? అని ఆట ప‌ట్టిస్తుంటారుట‌.

దూర ప్రాంతాల నుంచి షూటింగ్ కి ముగించుకుని ఇంటికొస్తే అమ్మ బియ్యం పిండి-కొబ్బ‌రి పాలు రొట్టి చేసి ఇస్తుందిట‌. దాంతో పాటు ర‌క‌ర‌కాల నాన్ వెజ్ ఐట‌మ్స్ వ‌డ్డిస్తారుట‌. ఇంట్లో ఉంటే ఎగ్ కార్న్ రైస్ నెల‌లో ఒక‌సారైనా తింటాడుట‌. త‌న‌తో పాటు మిగ‌తా వారికి క‌డుపునిండా పెట్టిస్తాడుట‌. ఇది చాలా కాలంగా దుల్కర్ కి ఉన్న అల‌వాటు అట‌. ఇక హైద‌రాబాద్ వ‌స్తే మాత్రం బిర్యానీ అంతు చూడ‌కుండా ఉండ‌డుట‌.

అయితే ఈ హీరోని ఒక‌సారి ప్ర‌భాస్ ఇంటికి తీసుకెళ్లాల్సిందే. డార్లింగ్ రుచులు దుల్క‌ర్ కి చూపిస్తే అత‌డిని అస్స‌లు వ‌దిలిపెట్ట‌డేమో. ఇద్ద‌రు ఒకే చోట క‌లిస్తే నాన్ వెజ్ తాట తీసేయ‌రు. ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులో 'ల‌క్కీ భాస్క‌ర్' అనే సినిమాలో న‌టిస్తున్నాడు. అలాగే త‌మిళ్ లో 'థ‌గ్ లైఫ్' లోనూ న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం దుల్కార్ కోలీవుడ్...టాలీవుడ్ మార్కెట్ మీద దృష్టి పెట్టి ప‌నిచేస్తున్నాడు.