ఆ స్టార్ హీరో డేట్లు ఇవ్వాలంటే కూతురు స్కూల్లో ఉండాలా?
మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సొంత పరిశ్రమ తర్వాత తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 17 Jun 2024 2:30 PM GMTమాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సొంత పరిశ్రమ తర్వాత తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. ఇక్కడ ఆయన్ని అభిమానించే వాళ్లెంతో మంది. ముఖ్యం గా లేడీ ఫాలోయింగ్ అతడికి పీక్స్ లో ఉంది. ఇంకా ఇతర పరిశ్రమల్లోనూ అవకాశాలొచ్చినప్పుడల్లా చేస్తున్నారు. అయితే ఇలా అన్ని పరిశ్రమల్ని బ్యాలెన్స్ చేయడం వల్ల సొంత పరిశ్రమలో ఎక్కువగా సినిమాలు చేయట్లేదు అన్న విమర్శలున్నాయి.
అందుకు కారణం అతడి బిజీ షెడ్యూల్ అనడంలో సందేహం లేదు. మరి అంత బిజీగా ఉండటానికి అసలు కారణం ఏంటి? అంటే తాజాగా ఈ చిన్న రీజన్ కూడా వెలుగులోకి వస్తోంది. కుమార్తెపై ఇష్టంతోనే కొన్ని సినిమా ఆఫర్లు కూడా వదులుకుంటున్నట్లు కుమార్తె మరియం సల్మాన్ మాటల్లో తెలుస్తుంది. `నేను స్కూల్ కి వెళ్లే టైమ్ కి ఇంట్లో ఉంటే నాన్నే స్వయంగా తీసుకెళ్తాడు. సమ్మర్ హాలీడే స్ అనంతరం స్కూల్ వెళ్లాలంటే ఇబ్బంది పడతా.
ఫస్ట్ డే ఐస్ క్రీమ్ తినిపించి స్కూల్లో కూర్చోబెడతాడు. ఇది చాలా కాలంగా వస్తోన్న ఓ సెంటిమెంట్. నా సెలవు రోజులు, బర్త్ డే పంక్షన్లు ఉంటే షూటింగ్ లేకుండా చూసుకుంటారు. అందుకే స్కూల్ క్యాలెండర్ ప్రకారమే సినిమా వాళ్లకు డేట్లు ఇస్తాడు. నా కారణంగా కొన్ని సినిమాలు కూడా చేయరు. అడిగితే నీ కన్నా ఏదీ ఎక్కువగా కాదు అంటారు. అలా అంటే ఓ వైపు సంతోషంగా అనిపించినా...మరోవైపు బాధగానూ అనిపిస్తుంది.
హాలీడేస్ రోజుల్లో ఇంట్లోనే ఉంటారు. స్నేహితులున్నా బయటకు వెళ్లడం తక్కువగా జరుగుతుంది. నాన్న సినిమా చూడను. చూసినా నాన్న ని కొట్టే సన్నివేశాలుంటే అస్సలు చూడను. అలా నాన్నని చూసి తట్టుకోలేను` అని అంది. ప్రస్తుతం దుల్కార్ సల్మాన్ తెలుగులో `లక్కీ భాస్కర్` అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.