Begin typing your search above and press return to search.

మల్లూ స్టార్‌ టాలీవుడ్‌ మోజు..!

టాలీవుడ్ సినిమాల బడ్జెట్‌ మరియు మార్కెట్‌ పరిధి గతంతో పోల్చితే పదుల రెట్లు పెరిగిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   9 July 2024 12:30 PM GMT
మల్లూ స్టార్‌ టాలీవుడ్‌ మోజు..!
X

టాలీవుడ్ సినిమాల బడ్జెట్‌ మరియు మార్కెట్‌ పరిధి గతంతో పోల్చితే పదుల రెట్లు పెరిగిన విషయం తెల్సిందే. అందుకే ఇతర భాషల సినిమా స్టార్స్ తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ నుంచి మొదలుకుని మలయాళ సినిమా ఇండస్ట్రీ వరకు ఎంతో మంది స్టార్స్ తెలుగు సినిమాలను చేస్తున్నారు.

మలయాళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుని, అక్కడ స్టార్‌ హీరోగా వెలుగు వెలుగుతున్న దుల్కర్ సల్మాన్‌ టాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈయన నటించిన మొదటి సినిమా మహానటి మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం, ఆ వెంటనే సీతారామం సినిమా ను చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.

ఇప్పుడు లక్కీ భాస్కర్ అనే సినిమాను చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న లక్కీ భాస్కర్ సినిమాను సితార ఎంటర్టైన్‌మెంట్స్ వారు నిర్మిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే నెలలో ఆ సినిమా రాబోతుంది.

ఒక వైపు లక్కీ భాస్కర్ సినిమాను చేస్తూనే మరో వైపు తెలుగు లో కొత్త సినిమాకు కమిట్‌ అయ్యాడు. పవన్‌ సాదినేని దర్శకత్వంలో ఒక సినిమాను దుల్కర్ సల్మాన్ చేయబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఆ సినిమా యొక్క షూటింగ్‌ ను త్వరలో ప్రారంభించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట.

మలయాళంలో వరుసగా పెద్ద సినిమాలు చేసే అవకాశాలు ఉన్నా.. అక్కడి పెద్ద దర్శకులు దుల్కర్ కోసం ఎదురు చూస్తున్నా కూడా ఆయన మాత్రం టాలీవుడ్‌ లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో మంచి కథలు వచ్చినప్పుడు వదలకుండా చేస్తున్న దుల్కర్‌ సల్మాన్‌ తెలివిని అభినందించాల్సిందే.