దుల్కర్ సల్మాన్ ఎందుకు అలా ?
మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే అగ్ర హీరోగా మారిపోయాడు
By: Tupaki Desk | 30 July 2024 5:51 AM GMTమలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే అగ్ర హీరోగా మారిపోయాడు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. కొత్తదనం ఉన్న కథలతో మూవీస్ చేస్తూ వస్తున్నాడు. మలయాళంలో ఏడాదికి 3-4 సినిమాలు చేసిన దుల్కర్ సల్మాన్ తరువాత ఇతర ఇండస్ట్రీ దర్శకులని ఆకర్షించాడు. మహానటి సినిమాలో జెమిని గణేశన్ క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకులకి దుల్కర్ సల్మాన్ చేరువ అయ్యాడు.
2022లో వచ్చిన సీతారామం సినిమా టాలీవుడ్ లో అతన్ని సోలో హీరోగా నిలబెట్టింది. ఆ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని దుల్కర్ సల్మాన్ గెలుచుకున్నాడు. సీతారామం సక్సెస్ తర్వాత టాలీవుడ్ లో అతనికి డిమాండ్ బాగా పెరిగింది. హిందీలో కూడా చుప్ అనే సినిమాతో దుల్కర్ సల్మాన్ హిట్ సొంతం చేసుకున్నారు.
మలయాళంలో చేసిన కింగ్ ఆఫ్ కోతా ఫ్లాప్ అయ్యింది. దీని తర్వాత తెలుగులో మరల వెంకి అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ మూవీకి దుల్కర్ సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్, సాంగ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మూవీ కూడా సక్సెస్ అవుతుందనే టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో తెలుగు మూవీకి దుల్కర్ సల్మాన్ ఒకే చెప్పాడు.
టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార అనే సినిమాని ఆయన బర్త్ డే సందర్భంగా పోస్టర్ తో ఎనౌన్స్ చేశారు. స్వప్న సినిమాస్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. గీతా ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. వైజయంతీ మూవీస్ సపోర్ట్ తో దుల్కర్ కి తెలుగులో ఛాన్స్ లు పెరుగుతున్నాయి. మహానటి, సీతారామం తర్వాత కల్కి 2898ఏడీలో ఓ కీలక పాత్రలో దుల్కర్ నటించాడు.
ఇప్పుడు ఆకాశంలో ఒక తార మూవీ ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలన్నీ వైజయంతీ మూవీస్ అనుబంధ సంస్థ అయిన స్వప్న సినిమాస్ లో వచ్చినవే కావడం విశేషం. తెలుగులో దుల్కర్ ప్రస్తుతం ట్రెండింగ్ హీరోగా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడని చెప్పొచ్చు. ఓ కొత్త దర్శకుడితో కూడా దుల్కర్ తెలుగులో మరో సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మాతృభాష మలయాళంలో మాత్రం దుల్కర్ సల్మాన్ గత రెండేళ్లలో కేవలం రెండు సినిమాలు మాత్రమే చేశాడు.
దుల్కర్ సల్మాన్ మాతృభాష చిత్రాలని, దర్శకులకి పట్టించుకోవడం లేదనే విమర్శలు మలయాళీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. తండ్రి మమ్ముట్టి గ్యాప్ లేకుండా మూవీస్ చేస్తూ ఉంటే దుల్కర్ సల్మాన్ మాత్రం తెలుగు సినిమాలకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడనే ప్రచారం నడుస్తోంది. అందులో మలయాళం నుంచి దుల్కర్ బర్త్ డే సందర్భంగా ఒక్క విషెస్ కూడా రాలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అయితే తెలుగులో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు టైర్ 2 హీరోల జాబితాలో చేరి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడని చెప్పొచ్చు. మంచి కంటెంట్ ఉన్న కథలు వస్తే అతను చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడు అనేలా మరికొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి ఎక్కువ స్థాయిలో హై రేంజ్ సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడి దర్శక నిర్మాతలతో చేస్తున్నాడు. అంతేగాని సొంత భాషను దుల్కర్ పక్కనే పెట్టలేదని మరికొందరి వాదన.