Begin typing your search above and press return to search.

వైజయంతి మూవీస్.. అప్పట్లో చిరు, ఇప్పుడు దుల్కర్‌!

టాలీవుడ్‌ సినీ చరిత్రలో వైజయంతీ మూవీస్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది అనడంలో సందేహం లేదు

By:  Tupaki Desk   |   25 Jun 2024 12:10 PM GMT
వైజయంతి మూవీస్.. అప్పట్లో చిరు, ఇప్పుడు దుల్కర్‌!
X

టాలీవుడ్‌ సినీ చరిత్రలో వైజయంతీ మూవీస్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది అనడంలో సందేహం లేదు. సీనియర్‌ ఎన్టీఆర్‌ తో సినిమాలు నిర్మించిన ఘనత అశ్వినీదత్‌ కి ఉంది. సుదీర్ఘమైన సినీ నిర్మాణంలో ఎంతో మంది హీరోలతో సినిమాలు చేసిన వైజయంతీ మూవీస్ ఆ మధ్య కాస్త స్లో అయినా మళ్లీ స్పీడ్‌ అందుకుంది.

ఇండియాస్ బిగ్గెస్ట్‌ మూవీ, పాన్ వరల్డ్‌ మూవీ కల్కి 2898 ఏడీ సినిమాను నిర్మించిన వైజయంతీ మూవీస్ నిర్మాతలు మరో వైపు చిన్న సినిమాలను మీడియం రేంజ్ సినిమాలను కూడా నిర్మిస్తూ ఉన్నారు. దుల్కర్‌ సల్మాన్ ను వరుసగా హీరోగా పెట్టి సినిమాలు తీస్తున్న ఈ బ్యానర్‌ మరోటి ఆయనతో ప్లాన్‌ చేస్తుందట.

చిరంజీవి తో 1980 మరియు 90 ల్లో పలు సినిమాలను నిర్మించిన వైజయంతి మూవీస్ వారు ఇప్పుడు వరుసగా దుల్కర్‌ సల్మాన్‌ తో సినిమాలను నిర్మించడం అరుదైన విషయంగా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్‌ లో ఇప్పటికే మహానటి, సీతారామం, కల్కి సినిమాలు చేసిన దుల్కర్ సల్మాన్‌ త్వరలోనే పవన్ సాదినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథ ఓకే అయ్యిందని త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

కల్కి హిట్‌ అయితే ఇక పై వైజయంతి మూవీస్ బ్యానర్‌ నుంచి వచ్చే ప్రతి సినిమాకు కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండే అవకాశం ఉంది. అందుకే దుల్కర్‌ సినిమాకు కచ్చితంగా భారీ ఆధరణ ఉండే అవకాశాలు ఉన్నాయి.