Begin typing your search above and press return to search.

#DUNE జాతీయ అవార్డ్ నటి ట‌బు స్ట‌న్నర్ లుక్

డూన్ : ప్రొఫెసి తాజా టీజర్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. ఇందులో భారతీయ అభిమానులు బాలీవుడ్ ఐకాన్ టబును చూశాక ఎగ్జ‌యిట్ అయ్యారు.

By:  Tupaki Desk   |   19 July 2024 1:28 PM GMT
#DUNE జాతీయ అవార్డ్ నటి ట‌బు స్ట‌న్నర్ లుక్
X

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఫ్రాంఛైజీ డూన్ కి ప్ర‌త్యేకించి ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా డూన్ ఫ్రాంఛైజీ ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందింది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీ నుంచి మోస్ట్ అవైటెడ్ 'డూన్: ప్రొఫెసీ' (డూన్ : జోశ్యం) విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

డూన్ : ప్రొఫెసి తాజా టీజర్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. ఇందులో భారతీయ అభిమానులు బాలీవుడ్ ఐకాన్ టబును చూశాక ఎగ్జ‌యిట్ అయ్యారు. ఆకర్షణీయమైన సీక్వెన్స్‌లో ట‌బు లుక్ ని రివీల్ చేసిన తీరు ఎంత‌గానో ఆక‌ర్షించింది. ఈ చిత్రంలో టబు లుక్ యూనిక్ గా ఉందంటూ అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. డూన్ లో రాణిలా క‌నిపిస్తోంద‌ని కూడా ప్ర‌శంసిస్తున్నారు.

టీజర్‌లో టబు పురాతనమైన మిస్టీక్ టచ్‌తో భవిష్యత్ అంశాలను సంపూర్ణంగా మిళితం చేసే విస్తృతమైన అలంక‌ర‌ణ‌తో ఉన్న‌ దుస్తులను ధరించి కనిపించింది. ట‌బు త‌ల‌కు ధ‌రించిన గంభీర‌మైన హెడ్ మాస్క్.. పై నుంచి కింది వ‌ర‌కూ లాంగ్ కోట్ త‌ర‌హా దుస్తులు చాలా ప్ర‌త్యేక‌త‌తో ఆక‌ర్షించాయి. వీక్షకులను మంత్రముగ్ధులను చేసే అద్భుతమైన రూప‌మిది. కథలో టబు ముఖ్యమైన పాత్రను పోషిస్తోంద‌ని కూడా అర్థ‌మ‌వుతోంది. తీక్ష‌ణ‌మైన‌ చూపులతో క‌మాండ‌ర్‌ని త‌ల‌పిస్తోంది. క‌థ‌లో శక్తివంతమైన కీలకమైన వ్యక్తి అని అర్థ‌మ‌వుతోంది.

ఈ టీజర్ ని వైర‌ల్ గా షేర్ చేస్తూ టబుపై అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఒక అభిమాని ఇలా రాసాడు. ''డూన్ కథలో ట‌బుకు మంచి పాత్ర ఉంటుందని ఆశిస్తున్నాను'' అని రాయ‌గా.. మరొక వ్యక్తి ఇలా రాసాడు. ''భారతీయ అభిమానులు సమావేశమయ్యారు! ఈ ప్రశంసలు పొందిన DUNE ఫ్రాంచైజీలో మా స్వంత టబు మేడమ్‌ని చూడటం చాలా గర్వంగా ఉంది'' అని ఆనందం వ్య‌క్తం చేసాడు.

డయాన్ అడెము-జాన్ రూపొందించిన 'డూన్: ప్రొఫెసీ' చిత్రం డూన్ -డూన్ 2 మాదిరిగానే అదే విశ్వంలో కొన‌సాగింపు క‌థ‌తో రూపొంద‌నుంది. ఇది అద్భుత‌మైన దృశ్య వైభవంతో పౌరాణిక చారిత్ర‌క కథనంతో ప్రశంసలు అందుకుంది. టబు పాత్ర గురించి పెద్దగా ఏ విష‌యాలు తెలియనప్పటికీ ఇందులో త‌న పాత్ర‌ ఎలా ఉంటుందో చూడాల‌నే ఉత్సుక‌త‌ అభిమానుల్లో పెరిగింది. ఈ సిరీస్ నవంబర్ 2024 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది.