స్టార్ హీరో బుకింగ్స్ ఆ రెండింటి రేంజ్ లో లేదే!
'పఠాన్'..'జవాన్' చిత్రాల బుకింగ్స్ కంటే డెడ్ స్లోగానే ఉన్నాయి. అందుకే షారుక్ ఖాన్ రంగంలోకి దిగాడు.
By: Tupaki Desk | 18 Dec 2023 7:43 AM GMTప్రభాస్ 'సలార్'... షారుక్ ఖాన్ 'డంకీ' ఒక్క రోజు గ్యాప్ లో రెండు చిత్రాలు బాక్సాఫీస్ పోటీకి సిద్దమైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 21న డంకీ రిలీజ్ అవుతుంటే...డిసెంబర్ 22న సలార్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఎవరి దమ్ము ఎంత అన్నది తొలి షో అనంతరం తేలిపోతుంది. ఎవరికి ఎన్ని షోలు పడ్డాయి? ఎంత వసూళ్లు తెచ్చింది? అనే లెక్కలు మొదటి రోజే ఓ క్లారిటీ వచ్చేస్తుంది.
ఆ సంగతి పక్కనబెడితే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లు నడుస్తున్నాయి. 'డంకీ' అడ్వాన్స్ బుకింగ్ మొదటి రోజున హిందీలో 2836 షోలకు దాదాపు 38,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మొత్తంగా అక్కడ నుంచి 1.36 కోట్ల వరకూ వచ్చినట్లు అంచనా. ఇక 'సలార్' బుకింగ్స్ డిసెంబర్ 15న ప్రారంభమైంది. బుకింగ్స్ రూపంలో 1.52 కోట్లు దాకా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వసూళ్లు లెక్కలు ఎక్కడ నుంచి అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో రెండు సినిమాల మధ్య అప్పుడే పోటీ పెట్టలేని సన్నివేశం కనిపిస్తుంది. అయితే డంకీ బుకింగ్స్ మాత్రం నెమ్మదిగానే ఉన్నాయని తెలుస్తోంది. 'పఠాన్'..'జవాన్' చిత్రాల బుకింగ్స్ కంటే డెడ్ స్లోగానే ఉన్నాయి. అందుకే షారుక్ ఖాన్ రంగంలోకి దిగాడు. టికెట్లు అడ్వాన్స్ గా బుక్ చేసుకోమని ఎక్స్ లో పంచుకున్నారు. 'ఇస్సే పెహ్లే కి హార్డీ సినిమాస్ మే పహోచ్ జాయే...ఔర్ సారే షోలు హౌస్‌ఫుల్ హో జాయే... ఆప్ అప్నీ టిక్కెట్స్ బుక్ కర్లో! క్యూన్ కీ జబ్ హార్డీ ఔర్ ఉస్కే యార్ ఆయేంగే, సబ్కే దిల్ లుట్ట్ పుట్ జాయేంగే' అని రాసుకొచ్చారు.
మరి ఈ రకమైన అభ్యర్ధన షారుక్ అభిమానుల్లో ఎంత మార్పు తీసుకొస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా గురించి ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కాడెల్ ఎక్స్‌లో పోస్ట్ చేసారు. 'రాబోయే మూడు రోజుల్లో డుంకీ బాక్సాఫీస్ పనితీరు గురించి స్పష్టమైన చిత్రాన్ని ఇస్తామన్నారు. 'డంకీ' ప్రీ-సేల్ విశేషమైన నోట్‌తో ప్రారంభమైంది. జాతీయ చైన్ మల్టీప్లెక్స్‌లలో సినిమా 10K + టిక్కెట్లు అమ్ముడయ్యాయి. జాతీయేతర గొలుసులో కూడా మంచి కదలిక కనిపిస్తుంది. ఇదే జోరు కొనసాగితే చివరి అడ్వాన్స్ బుకింగ్ పరంగా 2023 నాటి టాప్ చిత్రాలకు డంకీ సవాలు విసిరుతుంది' అని అన్నారు.
టిక్కెట్ విక్రయాలు ప్రత్యక్ష ప్రసారం అయిన 24 గంటల్లోపే జవాన్ 2,00,454 టిక్కెట్లను విక్రయించ గలిగారు, మొత్తం రూ.6.84 కోట్లు. అదేవిధంగా, పరిమిత వేదికలలో అందుబాటులో ఉన్నప్పటికీ, పఠాన్ మూడు జాతీయ సినిమా చైన్‌లలో అడ్వాన్స్ బుకింగ్ మొదటి రోజు దాదాపు 1.17 లక్షల టిక్కెట్లను విక్రయించింది.