Begin typing your search above and press return to search.

షారుఖ్ డంకీ సెన్సార్ U/A సర్టిఫికేట్

ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్త‌యాయి. CBFC బృందం సినిమాని వీక్షించి U/A సర్టిఫికేట్ అందించింది. రన్‌టైమ్ 161 నిమిషాలు (2 గంటల 41 నిమిషాలు).

By:  Tupaki Desk   |   15 Dec 2023 4:32 PM GMT
షారుఖ్ డంకీ సెన్సార్ U/A సర్టిఫికేట్
X

బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ పఠాన్ - జవాన్‌లతో SRK ఈ సంవత్సరం టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడు డంకీ తో హ్యాట్రిక్ కొట్టాల‌ని క‌ల‌లుగంటున్నాడు. కామెడీ చ‌తుర‌త‌ భావోద్వేగాల మిక్స్‌తో విలక్షణమైన రాజ్‌కుమార్ హిరాణీ స్టైల్‌లో సినిమా ఉంటుందని డుంకీ ట్రైలర్ సూచించింది. బాలీవుడ్ బాద్ షా తో మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజ్‌కుమార్ హిరాణీ మొదటిసారిగా సాంఘిక కామెడీ డ్రామా కోసం చేతులు క‌ల‌ప‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని పెంచింది.


ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్త‌యాయి. CBFC బృందం సినిమాని వీక్షించి U/A సర్టిఫికేట్ అందించింది. రన్‌టైమ్ 161 నిమిషాలు (2 గంటల 41 నిమిషాలు). ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. భారతదేశంలో అడ్వాన్స్‌లు రేపటి నుండి ప్రారంభమవుతాయి. పఠాన్, జవాన్ లాగా డుంకీ ఇతర భాషల్లోకి డబ్ కావడం లేదు. ఉత్త‌రాది మార్కెట్, ప్ర‌ధాన మెట్రోల‌ను టార్గెట్ చేసుకుని ఈ సినిమా విడుద‌ల‌వుతోంది.

ఈ చిత్రంలో తాప్సీ కథానాయికగా నటించింది. విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే నిర్మాత‌లు. జియో స్టూడియోస్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ , రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నిర్మించారు. డంకీ డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఆ మ‌రుస‌టి రోజు అంటే డిసెంబ‌ర్ 22న సలార్ అత్యంత భారీగా విడుద‌ల కానుంది.