Begin typing your search above and press return to search.

డంకీ టీజర్.. .. ఫన్​ అండ్ ఎమోషనల్​​

టీజర్ ఓపెన్​ చేయగానే.. షారుక్ ఖాన్​తో పాటు కొంతమంది ఎడారిలో బ్లాక్ డ్రెస్ ధరించుకుని ఇల్లీగల్​గా వెళ్తూ కనిపించారు

By:  Tupaki Desk   |   2 Nov 2023 7:49 AM
డంకీ టీజర్.. .. ఫన్​ అండ్ ఎమోషనల్​​
X

ఈ ఏడాది పఠాన్​, జవాన్ వంటి భారీ బ్లాక్ బస్టర్​ హిట్లతో జోరు మీదున్న బాలీవుడ్ బాద్‌షా షారుక్​ ఖాన్ - ఇదే ఏడాది డంకీతో వచ్చి హ్యాట్రిక్​ హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాజ్ కుమార్ హిరానీతో కలిసి ఈ 'డంకీ' సినిమా చేస్తున్నారు. రెండు భాగాలుగా సినిమా రూపొందుతోంది. అయితే నేడు నవంబర్ 2 షారుక్​ ఖాన్​ పుట్టినరోజు కావడంతో.. . ఓ చిన్న టీజర్​ను రిలీజ్ చేసి ఫ్యాన్స్​ను ఖుషి చేశారు మేకర్స్​.

టీజర్ ఓపెన్​ చేయగానే.. షారుక్ ఖాన్​తో పాటు కొంతమంది ఎడారిలో బ్లాక్ డ్రెస్ ధరించుకుని ఇల్లీగల్​గా వెళ్తూ కనిపించారు. ఆ తర్వాత వారిపై అనుమానం వచ్చిన ఓ వ్యక్తి గన్​ వారిలో ఒకరిని కాల్చడం, అనంతరం ఆ సీన్​ను డైవర్ట్​ చేసి కామెడీ అండ్ ఎమోషనల్​ మోడల్​కి తీసుకెళ్లిపోయారు. మొత్తంగా ఈ ప్రచార చిత్రం ఫన్ అండ్ ఎమోషనల్​గా సాగింది.

ఈ ప్రచార చిత్రం చూస్తుంటే ఐదుగురు కలిసి ఉన్నతమైన జీవితం​ కోసం ఇంగ్లాండ్‌ వెళ్లాలనే తమ కలను నెరవేర్చుకునేందుకు చేసిన ప్రయత్నమే కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పంజాబ్‌ ప్రాంతంలోని యువకుల కథను ఇతివృత్తంగా తీసుకుని ఇందులో చూపించనున్నట్లు కనిపిస్తోంది. మరి ఇంగ్లాండ్‌ వెళ్లేందుకు వారు ఎలాంటి ప్రయత్నాలు చేశారు?

ఇల్లీగల్​గా వెళ్లేందుకు సిద్ధమైన వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేది తెలియాలంటే డంకీ సినిమా తెరపై చూడాల్సిందే. ఈ చిత్రంలో విక్కీ కౌశల్, తాప్సీ బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాప్సీ మను అనే పాత్రలో కనిపించనుండగా.. విక్కీ సుఖి అనే పాత్ర పోషించారు.

మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్, లాగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే, సంజు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలను తీసిన రాజ్‌కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకుడు. దేశభక్తిని కూడా ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్మస్​కు బాక్సాఫీస్​ వద్ద సందడి చేయనున్నట్లు మేకర్స్ కన్ఫామ్ చేశారు. అంటే ఈ చిత్రం డిసెంబర్ 22న రాబోతున్న ప్రభాస్ సలార్​తో పోటిపడనున్నట్లు క్లారిటీ అయ్యింది.