Begin typing your search above and press return to search.

'డంకీ', ' సలార్'.. అలా చేసి ఉంటే వెయ్యి కోట్లు పక్కా?

అయితే ఈ రెండు సినిమాల కంటెంట్ డీసెంట్ గా ఉన్నప్పటికీ, రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చినప్పటికీ రూ.1000 కోట్ల మార్క్ కి చాలా దూరంగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   3 Jan 2024 12:52 PM GMT
డంకీ,  సలార్.. అలా చేసి ఉంటే వెయ్యి కోట్లు పక్కా?
X

గత నెలలో బాక్స్ ఆఫీస్ వద్ద బాలీవుడ్ నుంచి 'డంకీ', టాలీవుడ్ నుంచి 'సలార్' వంటి బడా సినిమాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే. ఇద్దరూ స్టార్ హీరోలే. రెండు సినిమాలకు రూ.1000 కోట్లు వసూలు చేసే సత్తా ఉంది. అయితే ఈ రెండు సినిమాల కంటెంట్ డీసెంట్ గా ఉన్నప్పటికీ, రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చినప్పటికీ రూ.1000 కోట్ల మార్క్ కి చాలా దూరంగా ఉన్నాయి.

దీనికి కారణం ఈ రెండు సినిమాలకు సరైన ప్రమోషన్స్ చేయకపోవడమే. షారుక్ ఖాన్ 'డంకీ' విషయానికొస్తే.. ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్ చేయలేదు. సినిమా నుంచి డ్రాప్1, డ్రాప్ 2 అంటూ టీజర్, సాంగ్స్, ట్రైలర్ ని రిలీజ్ చేశారు. కానీ అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఇది తెలిసి కూడా మేకర్స్ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా రిలీజ్ చేశారు. దాంతో డంకీ మూవీకి భారీ ఓపెనింగ్స్ రాలేదు. కనీసం చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ కూడా లేవు.

ఇక ఫుల్ రన్ లోనూ అదే ధోరణి కొనసాగుతోంది. ఇక 'సలార్' సినిమాకి సంబంధించి తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదు. ప్రభాస్ కి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది కాబట్టి ప్రమోషన్స్ చేసినా చేయకపోయినా ఇక్కడ భారీ కలెక్షన్స్ వస్తాయి. కానీ ఇతర భాషల విషయానికొస్తే అలా కాదు. ఇతర లాంగ్వేజెస్ లో ఖచ్చితంగా ప్రమోషన్స్ అవసరం. కానీ మూవీ టీం ఇతర భాషల్లో కూడా ప్రమోషన్ చేయలేదు.

ఒకవేళ ఇతర లాంగ్వేజెస్ లో బాగా ప్రమోట్ చేసి ఉంటే కచ్చితంగా సలార్ కి ఇప్పుడొస్తున్న కలెక్షన్స్ కంటే రెట్టింపు వచ్చేవి. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఇదే విషయాన్ని ఇటీవల వెల్లడించారు. సలార్ సినిమాలో ఉన్న బెస్ట్ కంటెంట్ ను మేకర్స్ చాలా ఆలస్యంగా రిలీజ్ చేశారు. రిలీజ్ కు మూడు 3-4 రోజుల సమయం ఉన్నప్పుడు పాటలు, యాక్షన్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఇతర భాషల్లో ఎలాంటి ఈవెంట్లు లేవు. కనీసం ప్రెస్ మీట్స్ కూడా పెట్టలేదు.

అందుకే లాంగ్ రన్ లో సలార్ కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. షారుక్ ఖాన్ 'డంకీ' ఇప్పటివరకు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ప్రభాస్ 'సలార్' మూవీ రూ.650 కోట్లు కొల్లగొట్టింది. మరో వారం రోజుల్లో సంక్రాంతికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అప్పటిలోగా ఈ రెండు సినిమాలు రూ.1000 కోట్ల మార్క్ అందుకోవడం చాలా కష్టం.