Begin typing your search above and press return to search.

స‌లార్ (Vs) డుంకీ: ఇరుపెద్దలు రాజీ బేరం?

సలార్ వర్సెస్ డుంకీ రిలీజ్ వార్ ఇటీవ‌ల‌ అతి పెద్ద చ‌ర్చ‌గా మారింది. కింగ్ ఖాన్ షారూఖ్ సినిమాతో పోటీప‌డుతూ ప్ర‌భాస్ న‌టించిన సినిమా విడుద‌ల‌వుతోంది.

By:  Tupaki Desk   |   1 Oct 2023 9:28 AM GMT
స‌లార్ (Vs) డుంకీ: ఇరుపెద్దలు రాజీ బేరం?
X

సలార్ వర్సెస్ డుంకీ రిలీజ్ వార్ ఇటీవ‌ల‌ అతి పెద్ద చ‌ర్చ‌గా మారింది. కింగ్ ఖాన్ షారూఖ్ సినిమాతో పోటీప‌డుతూ ప్ర‌భాస్ న‌టించిన సినిమా విడుద‌ల‌వుతోంది. రాజ్‌కుమార్ హిరాణీ లాంటి ఫైనెస్ట్ డైరెక్ట‌ర్ తో ఒక సౌత్ ద‌ర్శ‌కుడి సినిమా పోటీప‌డ‌డం కూడా అసాధార‌ణ ప‌రిణామం. అయితే ఈ రెండు భారీ సినిమాలకు స్క్రీన్‌లను స‌ర‌సంగా పంపిణీ చేయ‌డ‌మే ఇప్పుడు స‌మ‌స్య‌. ఎందుకంటే రెండు సినిమాలు రికార్డుల‌పై క‌న్నేశాయి. విజ‌యంపై ధీమాగా ఉన్నాయి. కానీ ఒకేసారి రెండు పెద్ద సినిమాలు స్క్రీన్ల‌ను షేర్ చేసుకుంటే అది స‌మ‌స్యాత్మ‌కం. ఆశించిన మైలేజ్ ద‌క్క‌ద‌నే ఆందోళ‌న ఇరువైపులా ఉంది. అయినా ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కార‌మే లేదా? అంటే ఉంద‌నే అంటున్నారు కొంద‌రు.

ఈ ఏడాది డిసెంబరు 22న డుంకీ.. సలార్ మ‌ధ్య వార్ ఫిక్స‌యిన‌ప్ప‌టి నుంచి దేశంలోని ఎగ్జిబిటర్‌లు డిస్ట్రిబ్యూటర్‌లకు నిద్రలేని రాత్రులు ఎదుర‌వుతున్నాయ‌నేది గుస‌గుస‌. ఇలాంటి పెద్ద సినిమాలు ఢీకొన్నప్పుడు చాలా గొడవలు, పోటీ వాతావ‌ర‌ణం త‌ట‌స్థిస్తుంద‌నేది అంద‌రికీ తెలిసిన వ్య‌వ‌హార‌మే. ఎక్కువ స్క్రీన్‌లను సాధించ‌డం కోసం ఇరువ‌ర్గాల మ‌ధ్యా ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం త‌లెత్తుతుంది. ఇది ఇద్ద‌రికీ మంచిది కాదు. ఇలాంటి పోటీన‌డుమ‌ ఎగ్జిబిటర్లు ఆల్ టైమ్ అసోసియేట్‌లను సంతోషంగా ఉంచడానికి ఏదో ఒక చిత్రాన్ని మాత్ర‌మే ఎంచుకోవలసి ఉంటుంది. కానీ ఇది ఇత‌రుల‌కు రుచించ‌దు. బాక్సాఫీస్ వద్ద సలార్, డుంకీ ఢీకొట్ట‌నుండ‌డంతో దీనినుంచి ఎలా గట్టెక్కాలని థియేటర్ యాజమాన్యం అంతా ఆలోచిస్తున్నారని హిందీ మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. అయితే అన్ని సినిమాలకు ఉత్తర భారతదేశంలో తగినంత స్క్రీన్‌లు వచ్చేలా చూసేందుకు ట్రేడ్ వర్గాలు తమ వంతు కృషి చేస్తున్నాయ‌ని కూడా చెబుతున్నారు.

స‌లార్ - యానిమల్ రెండింటిని అనీల్ తడాని AA ఫిల్మ్స్ పంపిణీ చేయనుంది. ప్ర‌ముఖ జాతీయ మీడియా క‌థ‌నం ప్రకారం.. సినిమా హాల్ యజమానులకు డుంకీ కంటే సాలార్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి అంగీకరిస్తేనే యానిమల్‌ని ప్రదర్శించే అవ‌కాశం క‌ల్పిస్తామని ఏఏ ఫిల్మ్స్ చెప్పడంపై డుంకీ నిర్మాత‌లు ఆందోళన చెందారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. గతంలో చాలా మంది పంపిణీదారులు ఈ పద్ధతిని అనుస‌రించాల్సి వ‌చ్చింది. ఒక సినిమాని అడ్డు పెట్టుకుని ఇంకో సినిమాని విడుద‌ల‌కు అడ్డంకులు సృష్టించ‌డం స‌రికాద‌ని కూడా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

అయితే ఏఏ ఫిల్మ్స్ విధానంపై రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన ప్ర‌తినిధులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. యానిమల్ నిర్మాణ సంస్థ‌లైన‌ టి-సిరీస్- భద్రకాళి పిక్చర్స్ ను రెడ్ చిల్లీస్ ప్ర‌తినిధులు సంప్రదించినట్లు తెలుస్తోంది. డుంకీపై స‌లార్‌ను పోటీకి దించి ఎగ్జిబిటర్లు చేతులు దులుపుకోకూడదనే హామీని వారు కోరుకున్నారని తెలిసింది. షారుఖ్ ఖాన్ ప్ర‌తినిధుల‌ ఆందోళనతో యానిమల్ నిర్మాతలు ప‌రిష్కార మార్గం కనుగొనే యోచ‌న చేస్తున్న‌ట్లు కనిపిస్తోంద‌ని, వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని కూడా టాక్ వినిపిస్తోంది.

షారుఖ్ ఖాన్ పరిణతిపై ప్ర‌శంస‌లు:

ప్ర‌భాస్ సినిమా `స‌లార్`ని విడుద‌ల చేస్తున్న ఏఏఫిలింస్ తో కింగ్ ఖాన్ షారూఖ్ ట‌చ్ లో ఉన్నార‌ని, వారితో శాంతియుత విడుద‌ల మార్గాల కోసం అన్వేషిస్తున్నార‌ని మీడియాలో క‌థ‌నాలు రావ‌డం ఆస‌క్తిక‌రం. స‌లార్ -డుంకీ రెండూ భారీ వ‌సూళ్ల‌ను సాధించే సామర్థ్యాన్ని కలిగిన సినిమాలు. ఈ రెండిటి న‌డుమా ఘ‌ర్ష‌ణ అనివార్య‌మ‌ని తెలిసి ఇప్పటికే ట్రేడ్‌ ఉలిక్కిపడింది. కానీ అలా జ‌ర‌గ‌కుండా రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పరిణతితో వ్య‌వ‌హ‌రిస్తోంది. షారూఖ్ ధృక్ప‌థం స‌రైన‌ది అని తెలిసింది. ఏదైనా సంబంధంలో కమ్యూనికేషన్ ఎంతో కీలకం. షారూఖ్ ఖాన్ ఇలాంటి యుద్ధాన్ని నివారించడానికి చొరవ తీసుకోవడం గొప్ప విష‌యం. త‌న‌ ప్రయత్నం పాజిటివ్ వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తోంద‌ని అంతా సంతోషిస్తున్నారు. దేశంలోని వివిధ‌ స్క్రీన్‌లను షేర్ చేసుకోవ‌డంలో ఘర్షణ లేకుండా శాంతియుతంగా ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్న‌మిద‌ని అర్థం చేసుకోవాలి. ఇలాంటి ప్ర‌య‌త్నాల‌తో ఇరువురు హీరోల అభిమానుల్లో యూత్ మధ్య కూడా గొడ‌వ‌లు త‌లెత్త‌కుండా ఆప‌డం కొంత‌వ‌ర‌కూ సాధ్యం.