ఆమెను చూసి ధనుష్ అసూయ...!
రాయన్ తో పాటు వేట్టయాన్ సినిమాల యొక్క అనుభవాలను మీడియాతో ఆమె షేర్ చేసుకుంది.
By: Tupaki Desk | 30 Sep 2024 10:30 PM GMTధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన 'రాయన్' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాతో నటిగా మంచి మార్కులు దక్కించుకున్న దుషారా విజయన్ త్వరలో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా 'వేట్టయాన్' తో రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన వేట్టయాన్ ను అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సినిమా ప్రమోషన్ లో భాగంగా దుషార విజయన్ మీడియా ముందుకు వచ్చి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాయన్ తో పాటు వేట్టయాన్ సినిమాల యొక్క అనుభవాలను మీడియాతో ఆమె షేర్ చేసుకుంది.
రాయన్ సినిమాలో ధనుష్ కి సోదరి పాత్రలో దుషారా విజయన్ నటించింది. సినిమాల్లో ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ధనుష్ సర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన తో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నాకు ధనుష్ అంటే ఎంత ఇష్టమో, ధనుష్ గారికి రజినీకాంత్ సర్ అంటే అంత అభిమానం అంది. రజినీకాంత్ సర్ తో నేను సినిమా చేస్తున్నాను అంటూ చెప్పిన సమయంలో ధనుష్ సర్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. నేను చాలా సంవత్సరాలుగా రజనీ సర్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాను. కానీ నా కంటే ముందు నీవు ఆ ఛాన్స్ దక్కించుకున్నావు అంటూ అసూయ వ్యక్తం చేసినట్లు తన సంతోషాన్ని పంచుకున్నారు.
రాయన్ తో పాటు వేట్టయాన్ సినిమాల షూటింగ్ ఒకేసారి జరిగింది. ఒకేసారి రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ కు హాజరు అవ్వడం నాకు చాలా సంతోషంగా అనిపించేది. రజినీకాంత్ సర్ తో నేను నటిస్తున్నట్లుగా చెప్పగానే ధనుష్ సర్ చేసిన వ్యాఖ్యలు నేను ఎప్పటికి మర్చి పోలేను. ఆయన కు రజినీకాంత్ సర్ అంటే చాలా అభిమానం అని ఆ మాటలతో అర్థం అయింది. ఎప్పటికి అయినా రజినీకాంత్ సర్ తో సినిమా చేయాలని ఆశ పడుతున్నట్లు గా చాలా సందర్భాల్లో ధనుష్ సర్ నాతో అన్నారని దుషార చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమిళ మీడియాలో ఈమె మాటలు వైరల్ అవుతున్నాయి.
రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన వేట్టయాన్ సినిమాకు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో మరో భారీ విజయాన్ని ఆయన సొంతం చేసుకోవచ్చు అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. రజినీకాంత్ తో పాటు ఈ సినిమాలో మంజు వారియర్, అమితాబచ్చన్, రానా ఇంకా పలువురు సినీ ప్రముఖులు నటించారు. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. దసరాకు విడుదల అవుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.