Begin typing your search above and press return to search.

దసరా 'సినీ' పండుగ.. రంగంలోకి దిగేది ఎవరెవరంటే?

మరి ఈ ఏడాది కూడా దసరాకు పలు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి.

By:  Tupaki Desk   |   6 Oct 2024 3:42 AM GMT
దసరా సినీ పండుగ.. రంగంలోకి దిగేది ఎవరెవరంటే?
X

సినిమాలకు పండుగలకు మంచి కనెక్షన్ విషయం తెలిసిందే. దాదాపు అన్ని ఫెస్టివల్స్ కు వివిధ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అందులో ఎక్కువగా సంక్రాంతికి విడుదలైతే.. ఆ తర్వాత వేసవిలో సందడి చేస్తాయి. అయితే దసరాకు కూడా ఎక్కువ హాలీడేస్ ఉండడంతో అనేక చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతాయి. మరి ఈ ఏడాది కూడా దసరాకు పలు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. అవేంటంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. వేట్టయన్ మూవీతో దసరా సినీ పండుగను స్టార్ట్ చేయనున్నారు. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా.. అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కానుంది. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్ వంటి వివిధ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు సినిమాలో భాగమవ్వడం విశేషం. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్న వేట్టియన్ పై మంచి అంచనాలే ఉన్నాయి.

అదే రోజు ఇప్పటికే మ్యాడ్, ఆయ్ మూవీలతో వరుస హిట్స్ అందుకున్న ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్‌.. శ్రీశ్రీశ్రీ రాజావారు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఆ సినిమా.. అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కానుంది. అయితే శ్రీశ్రీశ్రీ రాజావారు నార్నే నితిన్ ఫ‌స్ట్ మూవీ. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల మూడో సినిమాగా విడుదలవుతోంది.

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ విశ్వం.. దసరా కానుకగా రిలీజ్‌ కు సిద్ధమవుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తుండడంతో బాక్సాఫీస్ వద్ద విశ్వం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది. సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 11వ తేదీన సినిమా.. వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌ బాబు మా నాన్న సూపర్‌ హీరో మూవీ.. దసరా స్పెషల్ గా థియేటర్లలో అక్టోబర్ 11వ తేదీన విడుదల అవ్వనుంది. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాపై ప్రమోషనల్ కంటెంట్ ద్వారా మంచి బిజ్ క్రియేట్ అయింది. మరోవైపు, అదే రోజు మార్టిన్‌ మూవీతో అలరించనున్నారు ధృవ సర్జా. ఏపీ అర్జున్‌ తెరకెక్కించిన ఆ సినిమా.. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది.

వరుస సినిమాలతో సందడి చేస్తున్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్.. దసరా కానుకగా జనక అయితే గనకతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం.. అక్టోబర్ 12వ తేదీన విడుదల కానుంది. శిరీష్ సమర్పణలో దిల్‌‌‌‌‌‌‌‌ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై హర్షిత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించడంతో ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి చివరగా.. ఆయా హీరోలంతా దసరాకు వచ్చి ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.