దసరా సినిమాలకి ఎన్ని థియేటర్స్ దొరకొచ్చు?
తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి తర్వాత అతి పెద్ద ఫెస్టివల్ సీజన్ అంటే దసరా అని చెప్పాలి
By: Tupaki Desk | 13 Oct 2023 5:09 AM GMTతెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి తర్వాత అతి పెద్ద ఫెస్టివల్ సీజన్ అంటే దసరా అని చెప్పాలి. అందుకే దసరా రేసులో కూడా చాలా మంది హీరోలు తమ చిత్రాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ సారి దసరాకి మూడు పెద్ద సినిమాలు సౌత్ లో రాబోతున్నాయి. లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి.
ఈ సినిమాలు దేనికవే ప్రత్యేకం. ఇవి కాకుండా కన్నడం లో పాన్ ఇండియా మూవీగా ఘోస్ట్ రిలీజ్ రిలీజ్ అవుతోంది. టైగర్ ష్రాఫ్ హిందీ మూవీ ఘోస్ట్ తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో 1550 థియేటర్స్ ఉన్నాయి. వీటినే అన్ని సినిమాలు షేర్ చేసుకోవాలి. అక్టోబర్ 19న భగవంత్ కేసరి, లియో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఈ థియేటర్స్ లో 900 వరకు భగవంత్ కేసరి చిత్రానికి కేటాయించే ఛాన్స్ ఉంది. 500 థియేటర్స్ వరకు లియో చిత్రానికి దక్కొచ్చు. ఘోస్ట్ మూవీ మిగిలిన థియేటర్స్ కి పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది.అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ కానున్న నేపథ్యంలో భగవంత్ కేసరి నుంచి కొన్ని థియేటర్స్, లియో నుంచి కొన్ని థియేటర్స్ రవితేజకి కేటాయించే ఛాన్స్ ఉంది.
19న రిలీజ్ అయ్యే రెండు సినిమాలలో ఏ మూవీకి నెగిటివ్ టాక్ వస్తుందో ఆ సినిమా ఆడే థియేటర్స్ ఎక్కువ తగ్గిపోతాయి. సుమారు 700 థియేటర్స్ వరకు టైగర్ నాగేశ్వరరావుకి కేటాయించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. టైగర్ ష్రాఫ్ గణపత్ మూవీ కేవలం మల్టీప్లెక్స్ కి పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
డబుల్ డిజిట్ స్క్రీన్స్ కి మాత్రమె గణపత్ పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ చిత్రాలలో ఏ మూవీకి హిట్ టాక్ వస్తుందో ఆ చిత్రానికి వీకెండ్ తర్వాత థియేటర్స్ సంఖ్య పెంచే ఛాన్స్ ఉంటుంది. మరి వీటిలో ఏ చిత్రం సిల్వర్ స్క్రీన్ పై బలంగా నిలబడుతుంది అనేది వేచి చూడాలి.