దసరా సినిమాలు.. ఏ సినిమా రన్ టైమ్ ఎక్కువంటే..
మరి సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని నిలబడి భారీ వసూళ్లు సొంతం చేసుకునే సామర్ధ్యం ఏ మూవీకి ఉందనేది తెలియాలంటే ఎదురు చూడాల్సిందే.
By: Tupaki Desk | 12 Oct 2023 4:41 AM GMTదసరా బరిలో ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో నాలుగు చిత్రాలు పాన్ ఇండియా బ్రాండ్ తో వస్తూ ఉండగా ఒక్క బాలయ్య మూవీ మాత్రమే తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలు ఒకసారి చూసుకుంటే కోలీవుడ్ నుంచి ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన లియో మూవీ థియేటర్స్ లోకి అక్టోబర్ 19న వస్తోంది. అదే రోజు భగవంత్ కేసరి తెలుగులో రిలీజ్ అవుతోంది.
అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. కన్నడం నుంచి సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ మూవీ అక్టోబర్ 19న పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ నుంచి టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన గణపత్ మూవీ అక్టోబర్ 20న థియేటర్స్ లోకి వస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఈ చిత్రం రిలీజ్ అవ్వనుంది.
ఈ సినిమాల రన్ టైం ఇప్పటికే లాక్ అయ్యింది. టైగర్ నాగేశ్వరరావు మూవీ రన్ టైం రెండు గంటల రెండు నిమిషాల నిడివితో ఉంది. దళపతి లియో మూవీ మూవీ రెండు గంటల 44 నిమిషాల నిడివి ఉంటుంది. భగవంత్ కేసరి మూవీ రెండు గంటల 35 నిమిషాలు ఉందంట. శివరాజ్ కుమార్ ఘోస్ట్ మూవీ రెండు గంటల ఏడు నిమిషాలు, టైగర్ ష్రాఫ్ గణపత్ మూవీ 2 గంటల 10 నిమిషాలు నిడివి ఉందని తెలుస్తోంది.
ఈ చిత్రాలు దేనికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం. లియో, ఘోస్ట్ మూవీస్ మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో వస్తున్నాయి. భగవంత్ కేసరి, గణపత్ సినిమాలు కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా థియేటర్స్ లోకి రాబోతున్నాయి. టైగర్ నాగేశ్వరరావు పీరియాడిక్ బయోపిక్ స్టోరీగా సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలు అన్నింటిపైనా పాజిటివ్ బజ్ ఉంది.
మరి సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని నిలబడి భారీ వసూళ్లు సొంతం చేసుకునే సామర్ధ్యం ఏ మూవీకి ఉందనేది తెలియాలంటే ఎదురు చూడాల్సిందే. వీటిలో అన్నిటికంటే ఎక్కువ నిడివి ఉన్న చిత్రం లియో. అయితే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటూ స్పీడ్ స్క్రీన్ ప్లే కారణంగా లోకేష్ కనగరాజ్ సినిమాలు చాలా వేగంగా పూర్తయిపోయినట్లు ఉంటాయి.