Begin typing your search above and press return to search.

ఓజీ.. దానయ్య అనుకున్నట్లు జరుగుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజిత్.. ఓజీ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   17 Jun 2024 7:04 AM GMT
ఓజీ.. దానయ్య అనుకున్నట్లు జరుగుతుందా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజిత్.. ఓజీ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య శరవేగంగా జరిగిన ఈ మూవీ షూటింగ్ ఏపీ పాలిటిక్స్ పై పవన్ దృష్టి పెట్టడం వల్ల ప్రస్తుతం హోల్డ్ లో పడింది. కానీ మూవీ మాత్రంపై అంచనాలు అలానే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం.. వరుసగా పోస్టర్లు రిలీజ్ చేసి భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇటీవల ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయిన రోజు మరో పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేశారు.

రగిలే రివేంజ్ అంటూ పవన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేలా పోస్టర్ ను షేర్ చేశారు. అందులో పవన్ ఓ రేంజ్ లో కనిపించి ఆకట్టుకున్నారు. అయితే ఆ పోస్టర్ పై ఎక్కడా రిలీజ్ డేట్ ను మెన్షన్ చేయలేదు మేకర్స్. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ఆ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో ఓజీ విడుదల వాయిదా పడడం పక్కా అని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులకు సంబంధించి డీల్ ఖరారు అవ్వలేదని తెలుస్తోంది. ఫేమస్ ఓటీటీలు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓజీ రైట్స్ కోసం పోటీ పడ్డాయట. కానీ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య మాత్రం డిజిటల్ హక్కుల కోసం భారీ మొత్తంలో డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ టాప్ హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కనుక దానయ్య.. అంతగా డిమాండ్ చేశారని గుసగుసలు వినిపించాయి.

రూ.92 కోట్లు వెచ్చించి నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు వార్తలు వచ్చినా.. అవి నిజం కాదని తర్వాత తెలిసింది. ఓటీటీ నిర్వాహకులు ఎవరూ అంత మొత్తంలో చెల్లించడానికి ముందుకు రాలేదని సమాచారం. కొన్ని రోజులు వెయిట్ చేద్దామని సైలెంట్ అయ్యారట. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పవన్ కళ్యాణ్ కు నేషనల్ లెవెల్ లో ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. పొలిటికల్ గా అందరి దృష్టిని ఆకర్షించారు.

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడటం నుంచి విజయం సాధించడం వరకు కీలక పాత్ర పోషించారు. గేమ్ ఛేంజర్ గా వ్యవహరించారు. ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో భాగమైన ఆయన.. తుఫానుగా పేరు పొందారు. ఇమేజ్ తో పాటు అభిమానులను కూడా పెంచుకున్నారు. దీంతో ఇప్పుడు పరిస్థితుల బట్టి దానయ్య డిమాండ్లను ఏ ఓటీటీ సంస్థ అంగీకరించి ఓజీ హక్కులు దక్కించుకుంటుందో చూడాలి.