Begin typing your search above and press return to search.

ఈగల్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ ఎంత?

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం ఈగల్.

By:  Tupaki Desk   |   8 Feb 2024 6:27 AM GMT
ఈగల్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ ఎంత?
X

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం ఈగల్. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో సిద్ధమైన ఈ మూవీలో రవితేజ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో మూవీ ఉండబోతోందని ట్రైలర్ తోనే స్పష్టం అయ్యింది.

ఇక ఈ సినిమాలో కావ్యా థాపర్, అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ఈగల్ చిత్రం పై వరల్డ్ వైడ్ గా 21 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. అంటే 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మూవీ మీద ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది.

ఈగల్ మూవీ నైజాం హక్కులు 6 కోట్లకి అమ్ముడయ్యాయి. సీడెడ్ లో 2.5 కోట్లు, ఆంధ్రాలో 8.5 కోట్లకి వెళ్లగా మొత్తం తెలుగు రాష్ట్రాలు కలిపితే 17 కోట్ల మేరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2 కోట్లు, ఓవర్సీస్ లో 2 కోట్ల వ్యాపారం ఈగల్ చిత్రంపై జరిగింది. దీంతో 21 కోట్ల బిజినెస్ లెక్క తేలింది. మూవీ మీద మంచి బజ్ ఉన్న నేపథ్యంలో ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది.

తరువాత సినిమాకి వచ్చిన టాక్ బట్టి కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని ఈగల్ అందుకునే ఛాన్స్ ఉంది. అయితే ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి. రవితేజ చివరిగా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా తెరకెక్కించిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే ఈ సారి కార్తిక్ ఘట్టమనేని మాత్రం సరికొత్త కథతో రవితేజకి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నాడు. మరి ఎంత వరకు అది సాధ్యం అవుతుందనేది చూడాలి.

నైజాం - 6Cr

సీడెడ్ - 2.5Cr

ఆంధ్రా - 8.5Cr

ఏపీ తెలంగాణ టోటల్:- 17CR

కర్ణాటక & రెస్ట్ ఆఫ్ ఇండియా - 2Cr

ఓవర్సీస్ - 2Cr

వరల్డ్ వైడ్ టోటల్ - 21Cr

బ్రేక్ ఈవెన్ టార్గెట్ - 22Cr