Begin typing your search above and press return to search.

ఈగల్.. వాయిదా మేలే చేసింది!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్

By:  Tupaki Desk   |   18 Jan 2024 3:58 AM GMT
ఈగల్.. వాయిదా మేలే చేసింది!
X

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మూవీ ఉండబోతోందని ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చింది. కచ్చితంగా రవితేజ కెరియర్ లో బెస్ట్ మూవీస్ లో ఇదొకటి అవుతుందని బలంగా నమ్ముతున్నారు.

నిజానికి సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ నిర్మాతల మండలిలో చర్చల తర్వాత ఫిబ్రవరి 9కి వాయిదా వేసుకున్నారు. సింగిల్ డేట్ ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకోవడంతో మూవీ వెనక్కి వెళ్ళింది. అలాగే సంక్రాంతి రేసులో ఉన్న థియేటర్స్ ఆశించిన స్థాయిలో దొరికేవి కాదు. సంక్రాంతి అంటే ఎక్కువగా ఫ్యామిలీ, కమర్షియల్ కథలకి ఆదరణ ఉంటుంది.

కంప్లీట్ యాక్షన్ బేస్డ్ తో డిఫరెంట్ కథలపై ఆడియన్స్ శ్రద్ధ చూపించరు. ఈ విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఈ సంక్రాంతి రేసులో వచ్చిన సినిమాలలో హనుమాన్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వయస్సుల వారు చూడదగ్గ మూవీగా ఈ చిత్రం ఉంది. గుంటూరు కారం కమర్షియల్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది.

నా సామి రంగా మూవీ మాస్ కమర్షియల్ మూవీ అయిన విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కావడంతో ప్రేక్షకులు ఆదరించారు. అదే సైంధవ్ మూవీ కొత్త పాయింట్ తో కంప్లీట్ యాక్షన్ టోన్ లో చేసిన మూవీ కావడంతో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఒక వేల ఈగల్ చిత్రాన్ని రిలీజ్ చేసిన ఫలితం ఇలాగే ఉండేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. అలా కాకుండా ఫిబ్రవరి 9కి పోస్ట్ పోన్ చేసి మంచి పని చేశారని చెబుతున్నారు.

ఆ డేట్ కి రిలీజ్ అయ్యేవి చిన్న సినిమాలు కావడంతో ఈగల్ కి ఎక్కువ థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. మరి రవితేజ లో మాస్ యాంగిల్ ని డిఫరెంట్ కోణంలో ఆవిష్కరిస్తున్న కార్తిక్ ఘట్టమనేనికి ఈ మూవీ ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.