'ఈగల్'.. అందరిదీ ఒక్కటే సలహా..?
మరోవైపు ఈ సినిమాకి బయ్యర్స్ దొరకకపోవడం, మంచి థియేట్రికల్ బిజినెస్ జరగకపోవడంతో సినిమా నిర్మాతలే సొంతంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
By: Tupaki Desk | 2 Jan 2024 4:13 PM GMTమాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఈగల్' ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. జనవరి 13న థియేటర్స్ లో సందడి చేయనున్న ఈ సినిమా గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ.. వంటి సినిమాలతో పోటీ పడనుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ హీరోయిన్స్ గా నటిస్తుండగా నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో కనిపించరున్నారు.
ఇప్పటికే సినిమా నుంచి టీజర్, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో కావలసినంత బజ్ ని క్రియేట్ చేయలేకపోయింది. మరోవైపు ఈ సినిమాకి బయ్యర్స్ దొరకకపోవడం, మంచి థియేట్రికల్ బిజినెస్ జరగకపోవడంతో సినిమా నిర్మాతలే సొంతంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కాగా సంక్రాంతి వరుస సినిమాలు విడుదల కాబోతుండడంతో ఇతర నిర్మాతలు మరియు కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈగల్ మూవీని వాయిదా వేయమని నిర్మాతలని అభ్యర్థించారు. కానీ వాళ్లు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఇలాంటి సమయంలో ఇతర సినిమాలకు కారణంగా ఈగల్ కోసం థియేటర్స్ ని కేటాయించేందుకు డిస్ట్రిబ్యూటర్స్ కఠిన సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే 'ఈగల్' రిలీజ్ ని సంక్రాంతి నుండి జనవరి 26 కి వాయిదా వేయాలని డిస్ట్రిబ్యూటర్లు మేకర్స్ కి సూచిస్తున్నారట. జనవరి 26 పబ్లిక్ హాలిడేతో పాటూ లాంగ్ వీకెండ్ కూడా ఉండడంతో సినిమాని వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి ఆడియన్స్ లో 'ఈగల్' పై పెద్దగా బజ్ కూడా లేదు. కాబట్టి సంక్రాంతికి లిమిటెడ్ థియేటర్స్ లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఇది చాలా రిస్క్ తో కూడుకున్న సిచువేషన్ కాబట్టి ఈగల్ రిలీజ్ ని వాయిదా వేస్తే బాగుంటుందని ఇండస్ట్రీలో ఉన్న పలువురు నిర్మాతలు కూడా పీపుల్ మీడియా వాళ్లకి సూచనలు ఇస్తున్నారట. మరి నిర్మాతలు ఇందుకు ఒప్పుకుంటారా? లేక అదే ప్లాన్ కు కట్టుబడి ఉంటారా? అనేది చూడాలి.