చెప్పినట్టుగా ఈగల్.. సోలో డేట్ కావాలంటున్న నిర్మాత!
మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈగల్ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సింది.
By: Tupaki Desk | 19 Jan 2024 7:56 AM GMTమాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈగల్ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సింది. జనవరి 13వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్సయ్యే చాన్స్ లేదు అని కూడా అప్డేట్స్ ఇచ్చారు. అయితే అదే సమయంలో సంక్రాంతికి మరో నాలుగు సినిమాలు పోటీగా నిలిచిన విషయం తెలిసిందే. పోటీ తీవ్రత ఎంత ఉన్నా కూడా ఈగల్ సినిమా యూనిట్ మాత్రం అసలు తప్పుకునేది లేదు అని చెబుతూ వచ్చింది.
అయితే ఈ క్రమంలో ఎవరో ఒకరు తప్పుకుంటే గాని సంక్రాంతి బిజినెస్ సాఫీగా సాగదు అని తెలుగు చిత్ర నిర్మాతలు మండలి ఆలోచించింది. ఈ క్రమంలో అందరితోనూ మీటింగ్ కూడా జరిపారు. అయితే ఎవరు తప్పుకోకపోవడంతో ఈగల్ సినిమా ఒక్కటే వెనుకడుగు వేయాల్సి వచ్చింది. అయితే ముందుగా సంక్రాంతి నుంచి ఎవరైతే తప్పుకుంటారో వారికి తప్పకుండా మరొక సోలో రిలీజ్ డేట్ ఇస్తాము అని ఎలాంటి క్లాష్ లేకుండా థియేటర్స్ ఉంటాయి అని ఫిలిం ఛాంబర్ సభ్యులు భరోసా ఇచ్చారు.
నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా చర్చల తర్వాత అందుకు ఒప్పుకుంది. ఇక ఫిబ్రవరి 9వ తేదీ బెస్ట్ అని కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు అదే డేట్ కు మరో మూడు సినిమాలు పోటీగా ఉండబోతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన టిల్లు స్క్వేర్ అదే డేట్కు రాబోతుండగా రజినీకాంత్ లాల్ సలామ్ కూడా తెలుగులో అదే రోజు రానుంది.
రీసెంట్గా ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేసిన ఆ ఊరు పేరు భైరవకోన కూడా అదే డేట్ ను టార్గెట్ చేసింది. ప్రెస్ మీట్ లో కూడా హీరో సందీప్ కిషన్ మేము ఎట్టి పరిస్థితుల్లోనూ డేట్ మార్చుకునే అవకాశం లేదు అని కూడా ధీమాగా చెప్పాడు. ఇక ఈ విషయంపై మళ్ళీ స్పందించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు లేఖ రాశారు.
సంక్రాంతి నుంచి తప్పుకున్న సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తాము అని మాట ఇచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం కొన్ని సినిమాలు అదే డేట్కు వస్తున్నాయి. ఈ విషయంపై తెలుగు ఫిల్మ్ చాంబర్ సభ్యులు చర్చించి తమకు సోలో డేట్ ఇవ్వాల్సిందే అని ఆ లేఖలో వివరణ ఇచ్చారు. మరి ఈ విషయంపై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి చిత్ర నిర్మాతల మండలి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.