ఈగల్ రెండు వైపులా కత్తి.. తేడా వస్తే కష్టమే!
కానీ నిర్మాతలు మాత్రం ఆ వార్తలను ఖండించారు. నిజానికి ఈగల్ కి రెండు వైపులా తీవ్ర ఒత్తిడి ఉంది. మహేష్ గుంటూరు కారం మూవీని ఢీ కొట్టడం అంత ఈజీ కాదు.
By: Tupaki Desk | 11 Dec 2023 4:46 PM GMTమాస్ మహారాజా రవితేజ ఎంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడో అంతే స్పీడుగా రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ దసరాకి 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో వచ్చే సంక్రాంతికి 'ఈగల్' అంటూ సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే రెడీ అయిన టీజర్, సాంగ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. జనవరి 13న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు.
ఈ రిలీజ్ డేట్ ను దృష్టిలో పెట్టుకొనే అందుకు అనుగుణంగా సినిమా కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పోటీ మరీ ఎక్కువగా ఉండడంతో ఈగల్ వాయిదా పడి రిపబ్లిక్ డే కి రావొచ్చని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ నిర్మాతలు మాత్రం ఆ వార్తలను ఖండించారు. నిజానికి ఈగల్ కి రెండు వైపులా తీవ్ర ఒత్తిడి ఉంది. మహేష్ గుంటూరు కారం మూవీని ఢీ కొట్టడం అంత ఈజీ కాదు.
ఈ మూవీ తర్వాత టాక్ బాగుంటే ఆడియన్స్ దృష్టి 'హనుమాన్' వైపుకు వెళుతుంది. అటు మాస్ ఆడియన్స్ ని నేను రప్పిస్తానంటూ నాగార్జున 'నా సామిరంగా' సినిమాని చాలా ఫాస్ట్ గా రెడీ చేయిస్తున్నాడు. ఇక వెంకటేష్ 'సైంధవ్' పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్లు చేసుకుంటోంది. చాలాకాలం తర్వాత వెంకటేష్ నుండి వస్తున్న మాస్ యాక్షన్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. వీటన్నిట్లో ఎటొచ్చి ఈగల్ కే ప్రమాదం పొంచి ఉంది.
ఎందుకంటే అన్ని సినిమా లాగా ఈగల్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. మాస్ ఎలివెంట్స్ ఉన్నప్పటికీ డిఫరెంట్ స్టైల్ లో డార్క్ యాక్షన్ డ్రామాగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాని తెరకెక్కించారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి డిఫరెంట్ జోనర్ పండగ సీజన్ కి సెట్ కాదు. కానీ నిర్మాతలు మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని బయ్యర్లతో చెబుతున్నారట. ఒకవేళ సంక్రాంతి నుంచి రిపబ్లిక్ డే కి వెళ్దాం అనుకున్నా అక్కడ కూడా రిస్క్ తప్పదు.
ఎందుకంటే జనవరి 26 కి హృతిక్ రోషన్ ఫైటర్, విక్రమ్ తంగలాన్, మోహన్ లాల్ మలైకోటై వాలీబన్ వంటి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. తెలుగు మార్కెట్ వరకు వీటితో రవితేజ కి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ బయట రాష్ట్రాల్లో అంటే ప్రాబ్లం అవుతుంది. లేదు జనవరి 13 కే వస్తాం అనుకుంటే కంటెంట్ బాగున్నా సరే థియేటర్స్ కొరతతో పాటూ సరైన ఓపెనింగ్స్ రావు, కలెక్షన్స్ మీద ప్రభావం పడుతుంది. మరి ఈ తీవ్ర ఒత్తిడిలో ఈగల్ మేకర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.