యూత్ ఐకాన్ ఛాన్స్ ఆహీరోకే!
దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాలకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి.
By: Tupaki Desk | 3 April 2024 10:30 AM GMTదేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాలకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఏడాది సెలబ్రిటీలలో ఒకర్నీ ఈసీ యూత్ ఐకాన్ గా ఎంపిక చేయడం అనవాయితీగా వస్తోంది. తాజాగా ఇప్పుడా ఛాన్స్ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా వచ్చింది. భారత ఎన్నికల సంఘం ఆయుష్మాన్ ని యూత్ ఐకాన్ గా నియమిస్తూ కీలక బాధ్యతను అప్పగించింది. తాజాగా ఎక్స్ ఖాతాలో ఆయుష్మాన్ ఓ వీడియో షేర్ చేసాడు.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలని దేశ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ దశల్లో ఎన్నికలు జరగనున్నాయని.. అలాంటి పరిస్థితుల్లో రోజు.. తేదీలను బట్టి కచ్చితంగా ఒక్క రోజు మీ వంతు వచ్చినప్పుడు ఓటు వేయాలని కోరారు. `లోక్‌సభ ఎన్నికలు ఒక పండుగ. మనం అందరం మన విలువైన ఓట్లు వేయడం ద్వారా ఈ పండుగను ఘనంగా జరుపుకుందాం` అని అన్నారు. ఆయుష్మాన్ కి ఈ అవకాశం రావడంతో సెలబ్రిటీలంతా విషెస్ తెలియజేస్తున్నారు. ఇక ఆయుష్మాన్ ఎన్నో సందేశాత్మక చిత్రాల్లో నటించారు.
ఆయన నటించిన పాత్రలతోనే ఈ అవకాశం ఆయుష్మాన్ కి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు అయ్యే వరకూ ఓటు పై అన్నిరకాల అవేర్ నెస్ కార్యక్రమాల్లోనూ ఆయుష్మాన్ పాల్గొంటాడని తెలుస్తోంది. ఆయుష్మాన్ ఖురానా సినిమాల సంగతి చూస్తే.. ఆయన చివరిగా `డ్రీమ్ గాళ్-2` లో నటించాడు. ఇందులో ఆయనకి జోడీగా అనన్యా పాండే నటించింది. ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయింది. అప్పటి నుంచి మళ్లీ కొత్త ప్రాజెక్ట్ ఏది కన్పమ్ కాలేదు.
`విక్కీ డోనర్` సినిమాతో ఆయుష్మాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆయుష్మాన్ కి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో..సందేశాత్మక చిత్రాల్లో నటించాడు. అలాగే పలు టెలివిజన్ షోస్ ని ఝహోస్ట్ చేసాడు. అయితే ఐదేళ్లగా బుల్లి తెరకు దూరంగా ఉంటున్నాడు. కేవలం సినిమాల్లో నటించడంపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాడు.