అంతర్జాతీయ వేదికపై 'దేవర' చుట్టమల్లె సాంగ్..!
ఎడ్ షీరన్ తన లైవ్ షో లో దేవర సాంగ్ చుట్టమల్లె అంటూ పాడటంతో ఆడిటోరియం మొత్తం మారుమ్రోగింది.
By: Tupaki Desk | 10 Feb 2025 6:48 AM GMTఅల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలోని పాటలు అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యాయి. రెండు మూడు పాటలు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును దక్కించుకున్నాయి. సోషల్ మీడియాలో దాదాపు ఏడాది పాటు వైరల్ అయ్యాయి. అంతర్జాతీయ స్థాయి స్టార్స్, సెలబ్రెటీలు పుష్ప పాటలకు స్టెప్స్ వేయడంతో అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు తెలుగు పాటకు ఆ స్థాయి గుర్తింపు దక్కలేదు. ఇన్నాళ్ల తర్వాత తెలుగు పాట అంతర్జాతీయ స్థాయిలో వినిపించింది. ప్రపంచ ప్రసిద్ది గాంచిన పాప్ గాయకుడు ఎడ్ షీరన్ ఇటీవల బెంగళూరులో లైవ్ షో చేశారు. ప్రపంచం మొత్తం చూసిన ఆ షోలో దేవర సాంగ్‌ను పాడారు.
ఎడ్ షీరన్ తన లైవ్ షో లో దేవర సాంగ్ చుట్టమల్లె అంటూ పాడటంతో ఆడిటోరియం మొత్తం మారుమ్రోగింది. వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ షీరన్ చుట్టమల్లే పాటను పాడటంతో అంతా సర్‌ప్రైజ్ అయ్యారు. ప్రస్తుతం ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకు ముందు పాటను ప్రాక్టీస్ చేసిన వీడియోలను సైతం సోషల్ మీడియాలో నిర్వాహకులు షేర్ చేయడం ద్వారా వైరల్ అయ్యింది. మొత్తానికి దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్‌కి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకు వచ్చే విధంగా మరింత అందంగా షీరన్ పాట పాడారు అంటూ అభిమానులు తెగ మురిసి పోతున్నారు.
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్‌కి మంచి స్పందన దక్కింది. సినిమాలో ఉన్నవి కొన్ని పాటలే అయినా ఆ పాట సినిమా స్థాయిని పెంచింది అనడంలో సందేహం లేదు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత సారధ్యంలో ఈ పాట వచ్చింది. పాటలోని విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. అంతే కాకుండా పాటకి లక్షల మంది రీల్స్ చేయడం ద్వారా ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎడ్‌షీరన్ పాటను పాడటం ద్వారా మరింతగా పాట పాపులారిటీని సొంతం చేసుకుంటుంది అనడంలో సందేహం లేదు.
దేవర సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ ఏడాది చివర్లో దేవర పార్ట్ 2 పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నాడు. మరో వైపు వార్ 2 షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. ఇదే నెలలో లేదా వచ్చే నెలలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వార్ 2 ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.