ఆ సినిమా ఇండస్ట్రీపై ఈడీ ఎటాక్!
దీంతో ఈడీ కన్నడ ఇండస్ట్రీని కూడా టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. సాధారణంగా ఈడీ దాడులంటే ఎక్కువగా టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలపై జరుగుతుంటాయి.
By: Tupaki Desk | 20 Jun 2024 11:56 AM GMTఇటీవల రిలీజ్ అయిన కన్నడ సినిమా `మంజుమ్మల్ బోయ్స్` భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే ఇప్పుడీ వసూళ్లే వివాదాస్పదంగా మారడంతో వ్యవహారం ఈడీ వరకూ చేరింది. ఈ సినిమాలో సిరాజ్ అనే వ్యక్తి తాను రూ. 7 కోట్లు పెట్టుబడి పెట్టానని ఫిర్యాదు చేయడంతో గందరగోళంగా మారింది. విజయం సాధించి మంచి లాభాలు వస్తే 40 శాతం వాటా వచ్చేలా చిత్ర నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నట్లు సిరాజ్ ఆరోపిస్తున్నాడు.
కానీ రిలీజ్ తర్వాత అతడికి ఎలాంటి మొత్తం రాలేదని ఆరోపించాడు. సరిగ్గా ఇదే సమయంలో ఈడీ ఆ సినిమా వసూళ్లపై దృష్టి పెట్టింది. ఈ చిత్ర నిర్మాతలు షోబిన్ షాహిర్, బాబు షాహిర్ ,షాన్ ఆంటోనీలను ఈడీ విచారించింది. ఈడీ ఆ సినిమా నిర్మాతలు, పంపిణీదారుల అకౌంట్లను ప్రీజ్ చేసింది. సినిమా నిర్మాణం, పంపిణీకి సంబంధించి మనీలాండరింగ్‌కు పాల్పడి అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
అలాగే ఈ సినిమా నిర్మాణం సహా వ్యాపారలాదేవీలు జరిపిన అందరి అకౌంట్లను కూడా స్థంబింపజేసింది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. ఈ ఎఫెక్ట్ మిగతా సినిమాలపైనా పడింది. ఇటీవల కాలంలో రిలీజ్ అయి మంచి విజయం సాధించిన సినిమాల వ్యాపార లావాదేవీలపైనా ఈడీ కన్నేసింది. సినిమా నిర్మాణం సక్రమంగా జరిగిందా? వసూళ్ల పరంగా ఏమైనా అవకతకలు జరిగాయా? వంటి అన్ని కోణాల్లో ఈడీ విచారణకు రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
గత మూడేళ్లగా కన్నడ సినిమాలు కూడా భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. సినిమా నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగింది. వందల కోట్లతో నిర్మాణం అక్కడా జరుగుతోంది. దీంతో ఈడీ కన్నడ ఇండస్ట్రీని కూడా టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. సాధారణంగా ఈడీ దాడులంటే ఎక్కువగా టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలపై జరుగుతుంటాయి. సౌత్ లో ఈ రెండు పెద్ద పరిశ్రమలు కావడంతో ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది ఈడీ. ఇప్పుడా జాబితాలో కన్నడ పరిశ్రమ కూడా చేరినట్లు కనిపిస్తోంది.