Begin typing your search above and press return to search.

ఆ సినిమా కోసం చెప్పులు కుట్టడం నేర్చుకున్న మెగాస్టార్!

కానీ 'స్వ‌యంకృషి'లో చిరంజీవి చెప్పులు కుట్టే సాంబ‌య్య పాత్ర పోషిస్తారు.

By:  Tupaki Desk   |   25 Sep 2024 1:30 PM GMT
ఆ సినిమా కోసం చెప్పులు కుట్టడం నేర్చుకున్న మెగాస్టార్!
X

మెగాస్టార్ చిరంజీవి- కె. విశ్వ‌నాధ్ కాంబినేష‌న్ లో రూపొందిన క్లాసిక్ హిట్ 'స్వ‌యంకృషి' గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మెగాస్టార్ కెరీర్ లో ఇదొక మైల్ స్టోన్ మూవీ. ఆ సినిమాకే తొలిసారి ఉత్త‌మ న‌టుడిగా చిరంజీవి అవార్డు అందుకున్నారు. అంత‌వ‌ర‌కూ ఎన్నో సినిమాలు చేసారు. ఎన్నో పాత్ర‌ల్లో న‌టించారు. కానీ 'స్వ‌యంకృషి'లో చిరంజీవి చెప్పులు కుట్టే సాంబ‌య్య పాత్ర పోషిస్తారు.


అదే రోల్ చిరుకు కొత్త ఐడెంటిటీని తీసుకొచ్చింది. తాజాగా ఆపాత్ర గురించి నిర్మాత ఏడిద నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు న‌టుడు శ్రీరామ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు రివీల్ చేసారు. అవేంటో ఆయ‌న మాట‌ల్లోనే.. 'స్వయంకృషి' సినిమా సమయానికి చిరంజీవిగారు సుప్రీమ్ హీరో. ఆయనకి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఆయనను కలిసి ఆ కథను చెప్పడానికి నాన్నగారు - విశ్వనాథ్ గారు కలిసి చాలా ఆలోచించారు.

ఒప్పుకుంటారో లేదోనని? సందేహం. కానీ కథ వినగానే ఆయన ఒప్పుకున్నారు. చెప్పులు కుట్టే అతణ్ణి ఇంటికి పిలిపించుకుని, చెప్పులు కుట్టడం నేర్చుకున్నారు. ఆ సినిమా ఆయనకి నంది అవార్డును తెచ్చిపెట్టింది.'సిరిసిరిమువ్వ' , 'శంకరాభరణం' , 'స్వాతిముత్యం' ఈ సినిమాల కథలను ముందుగా విశ్వనాథ్ గారు చాలామంది పెద్ద నిర్మాతలకు వినిపించారట. వాళ్లెవరూ ఆ కథలను సినిమాగా తీయడానికి ఒప్పుకోలేదు.

ఆ విషయాన్ని విశ్వనాథ్ గారే స్వయంగా చెప్పేవారు. ఆ విషయం చెప్పిన తరువాతనే, ఆ కథలను ఆయన నాన్నగారికి వినిపించారు. ఆ కథలపై .. విశ్వనాథ్ గారిపై గల నమ్మకంతో నాన్నగారు ఒప్పుకున్నారు .. అలా అవి క్లాసికల్ అనిపించుకున్నాయి' అన్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఆణిముత్యాలు అనిపించే సినిమాల జాబితాలో పూర్ణోదయా బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలెన్నో ఉన్నాయి. కె విశ్వనాథ్ .. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కలిసి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతోనే ఇది సాధ్య‌మైంది.