ఫిలిం డైరెక్టర్ ఆఫీస్‌లో ED అధికారులు పారామిలటరీ?
మార్చిలో డ్రగ్ నెట్‌వర్క్ నడుపుతున్నందుకు జాఫర్ సాదిక్ అనే సినీ నిర్మాతను ఎన్‌సిబి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 April 2024 4:32 AM GMTప్రముఖ తమిళ డైరెక్టర్ అమీర్ కార్యాలయంలో ED అధికారులు, పారామిలటరీ బలగాలు ప్రత్యక్షం కావడంపై తమిళ మీడియా కథనాలను వెలువరించింది. ప్రస్తుతం చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్ ఇది.
మార్చిలో డ్రగ్ నెట్‌వర్క్ నడుపుతున్నందుకు జాఫర్ సాదిక్ అనే సినీ నిర్మాతను ఎన్‌సిబి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జాఫర్ 2000 కోట్ల మేర డ్రగ్స్ దందా సాగించాడని ఈడి గుర్తించి అరెస్ట్ చేసింది. దర్శకుడు అమీర్ తెరకెక్కించిన `ఇరైవన్ మిగ పెరియవన్` చిత్రానికి డ్రగ్ డాన్ జాఫర్ సాధిక్ నిధులు సమకూర్చారని కథనాలొచ్చాయి. ఏప్రిల్ 2న అమీర్ సుల్తాన్‌ను ఎన్‌సిబి విచారణ కోసం పిలిపించింది. అతను వ్యక్తిగతంగా ఎన్.సి.బి ఎదుట హాజరయ్యారు.
ఈ మంగళవారం నాడు చెన్నై టీ నగర్‌లోని అమీర్ కార్యాలయంపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించడంతో పరిసరాల్లో కలకలం చెలరేగింది. చెట్‌పేట్‌లోని అమీర్‌కు చెందిన ముఖ్తార్ గార్డెన్ ఇంట్లో కూడా ఈడీ సోదాలు జరిపిందని, టి నగర్‌లోని అమీర్ కార్యాలయంలో సాయుధ పారామిలటరీ బలగాలను మోహరించాయని కూడా ప్రముఖ తమిళ మీడియా కథనం వెలువరించింది.
మంగళవారం ఉదయం 7 గంటల నుంచి డైరెక్టర్ అమీర్ ఆఫీసులోనే కాకుండా ఈడీ అధికారులు చెన్నై వ్యాప్తంగా 30కి పైగా చోట్ల సోదాలు నిర్వహించారు. దీంతో నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్‌సీబీ విచారణ అనంతరం అమీర్ కి చెందిన స్థలాల్లో దాడులు జరగడంపై అభిమానులు షాక్‌కు గురయ్యారు. మరి డ్రగ్స్ కేసుతో దీనికి సంబంధం ఉందా లేదా అనేదానిపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.