బాలీవుడ్ పై ఈడీ మాటేసి వేటు వేసేలా ఉందే!
ఇదంతా ఒక ఎత్తైతే మహదేవ్ ఆన్ లైన్ యాప్ ని ప్రమోట్ చేసిన బాలీవుడ్ సెలబ్రిటల చిట్టా కూడా పెద్దదే ఉందని ఈడీ భావిస్తోంది.
By: Tupaki Desk | 17 Sep 2023 2:30 AM GMTమహదేవ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ స్కాం ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ స్కాంలో నటీనటులు..సింగర్లు చాలా మందే కనిపిస్తున్నారు. ఇప్పటికే టైగర్ ష్రాఫ్.. సన్నిలియోన్.. గాయని నేహా కక్కర్..నష్రత్ భరుచ్చా..కృతి కర్బందా పేర్లు తెరపైకి వచ్చాయి. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ )వీళ్లందరికీ నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్దం చేస్తోంది. 5000 కోట్ల మనీలాండరింగ్ పై ఈడీ కూపీలాగుతోంది.
తీగ కదిపితే ఢొంకంతా కదులుతోంది. అందులో ప్రముఖంగా బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు ఎక్కువగా తెరపైకి వస్తున్నాయి. 200 కోట్లు ఖర్చు చేసి కింగ్ పిన్ సౌరబ్ చంద్రకర్ దుబాయ్ లో వివాహం చేసుకోవడం..ఆ పెళ్లికి ప్రత్యేక విమానల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అనంతరం సౌరబ్ సెలబ్రిటీలు అందరికీ ప్రత్యేకంగా సెవన్ స్టార్ లగ్జరీ హోటల్ లో పార్టీ ఏర్పాటు చేయడం వంటివి కేసులో సంచలనంగా మారుతున్నాయి.
ఆ పార్టీకే కేవలం 40 కోట్లు ఖర్చు చేసారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రయివేట్ జెట్ లను అద్దెకు తీసుకోవడం..సెలబ్రిటీలు..వెడ్డింగ్ ప్లానర్లు.. డెకరేటర్లు ఇలా చాలా మంది ఈ కేసులో కనిపిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే మహదేవ్ ఆన్ లైన్ యాప్ ని ప్రమోట్ చేసిన బాలీవుడ్ సెలబ్రిటల చిట్టా కూడా పెద్దదే ఉందని ఈడీ భావిస్తోంది. వీరంతా వివిధ యూట్యూల్లో..సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఆ యాప్ ని పెద్ద ఎత్తున ప్రమెట్ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ ప్రకటనలో నటించింనదకు కోట్ల రూపాయలు పారితోషికాలుగా అందుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఓ ప్రముఖ హాస్య నటుడు..ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్..ఒక టాప్ బీ రంగ్ మేల్ స్టార్..ఒక మహిళా కామిక్ స్టార్ యాప్ యాజమాన్యం నుంచి పేమెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పేర్లను ఈడీ గోప్యంగా ఉంచుతుంది. నేరుగా నోటీసుల ద్వారా నే ఆ వివరాలు బయటకు రావాలని భావించి ఇలా చేస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.