సూపర్ స్టార్ కి ఈడీ సమన్లు
బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ కి ఈడీ నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 4 Oct 2023 1:42 PM GMTబాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ కి ఈడీ నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక గేమింగ్ యాప్ కి సంబంధించిన కేసు లో రణబీర్ కపూర్ ని విచారించేందుకు గాను ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ విషయమై ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇంకా పలువురు ప్రముఖులు కూడా ఈడీ నోటీసులు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మహాదేవ్ అనే బెట్టింగ్ యాప్ పేరుతో భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్ జరుగుతున్నట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఆ యాప్ ని ఛత్తీస్గఢ్ కి చెందిన సౌరబ్ చంద్రఖర్ మరియు రవి ఉప్పల్ లు యూఏఈ నుండి నిర్వహిస్తున్నారు. దుబాయ్ కేంద్రంగా ఇండియాలో బెట్టింగ్ లు నిర్వహిస్తున్న ఈ యాప్ భారీ ఎత్తున అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు.
ఇటీవల యూఏఈ లో సౌరబ్ చంద్రఖర్ వివాహం జరిగింది. ఆ వివాహానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరు అయ్యారు. అందులో రణబీర్ కపూర్ కూడా ఉన్నాడు. సౌరబ్ మరియు రవి ఉప్పల్ తో రణబీర్ కపూర్ పలు సార్లు మాట్లాడినట్లుగా కూడా ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయి.
వేల కోట్ల డబ్బు మనీ లాండరింగ్ ద్వారా అక్రమంగా తరలించబడుతున్నట్లుగా గుర్తించామని ఈడీ అధికారులు పేర్కొన్నాడు. ఈ కేసు లో బాలీవుడ్ కి చెందిన మరింత మందిని విచారించే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది. మొత్తానికి బాలీవుడ్ ని మరోసారి ఈ గేమింగ్ యాప్ కేసు షేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.