సన్నిలియోన్..టైగర్ ష్రాప్..కృతి కర్భందా పై ఈడీ కన్ను!
బాలీవుడ్ నటీనటులకు ఈడీ విచారణలు కొత్తేం కాదు. ఇప్పటికే పలు కుంభకోణాల్లో కొంత మంది నటీనటులపై విచారణలు జరిగాయి.
By: Tupaki Desk | 16 Sep 2023 9:47 AM GMTబాలీవుడ్ నటీనటులకు ఈడీ విచారణలు కొత్తేం కాదు. ఇప్పటికే పలు కుంభకోణాల్లో కొంత మంది నటీనటులపై విచారణలు జరిగాయి. తాజాగా మహదేవ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ స్కాం ( ఎంఓబీ) కేసు బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ఈ కుంభకోణంలో సంబంధం ఉన్న ఆరోపణలతో 17 మంది బాలీవుడ్ నటీనటులకు ఈడీ నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
టైగర్ ష్రాఫ్.. సన్నిలియోన్..గాయని నేహా కక్కర్..నష్రత్ భరుచ్చా తదితరుల పేర్లు దర్యాప్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ కుంభకోణానికి సంబంధించి మొత్తం 39 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. మొత్తం 417 కోట్లు ..కొన్ని డాక్యుమెంట్లను ఈడీ ఇప్పటికే సీజ్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మహదేవ్ బుక్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంక్రదర్ వివాహ వేడుకకు పలువురు నటులు..గాయకులు హాజరయ్యారు.
అతిఫ్ అస్లాం.. రహత్ ఫతే అలీఖాన్.. భారతీ సింగ్.. భాగ్య శ్రీ.. కృతి కర్బందా..కృష్ణ అభిషేక్ లకు ఈడీ షాక్ ఇవ్వనుందని సమాచారం అందుతోంది. కుంభకోణంలో వీరందరికి సంబంధం ఉండొచ్చని ఈడీ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. దుబాయ్ లోని సెవెన్ స్టార్ లగ్జరీ హోటల్ లో ఈసెప్టెంబర్ 18జన జరగాల్సిన పార్టీకి హాజరయ్యేందుకు బెట్టింగ్ ప్లాట్ ఫాం ప్రమోటర్లు 40 కోట్లు చెల్లించారన్న ఆరోపణలతో కొంత మంది తారలను ఈడీ పరిశీలిస్తోంది.
బాలీవుడ్ పెద్దలు రెండు ఈవెంట్లకు..ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థల నుంచి హవాలా ద్వారా నగదు చెల్లింపులు అందుకున్నారు అనేది ఆరోపణ. పాకిస్తాన్ కి చెందిన ఒక అసోసియేట్ తో ఎంఓబీ సమన్వయంతో బెట్టింగ్ యాప్ ని లాంచ్ చేసిందన్న ఆరోపణలను కూడా ఈ విచారణ ధృవీకరిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మరి ఈడీ నోటీసులు ఎంత మందికి జారీ చేస్తుందో చూడాలి.